ETV Bharat / sitara

రకుల్‌ భయస్తురాలైన అమ్మాయి: చంద్రశేఖర్‌ యేలేటి

నితిన్​ ప్రధాన పాత్రలో నటించిన 'చెక్'​ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు చంద్రశేఖర్​ యేలేటి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిత్ర విశేషాలు గురించి పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

check
చెక్​
author img

By

Published : Feb 20, 2021, 3:24 PM IST

'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'సాహసం'.. ఇలా వరుస ప్రయోగాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆయన తిరిగి మెగాఫోన్‌ పట్టారు. నితిన్‌ హీరోగా 'చెక్‌'ను చిత్రీకరించారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌ యేలేటి.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం..

check
చంద్రశేఖర్​ యేలేటి

గ్యాప్‌ వచ్చింది..

'మనమంతా' తర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్‌ తీసుకున్నా. కొన్నిసార్లు సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకోవాలంటే కొంత గ్యాప్‌ తీసుకోవాల్సి వస్తుంది. మంచి కథను సిద్ధం చేయడానికే ఈ గ్యాప్‌. ఈ క్రమంలోనే రెండు, మూడు కథలు రాసుకున్నా. అలా, 'చెక్‌'తో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను.

పదేళ్ల కిత్రం ఆలోచన..

'చెక్‌' కథ ఆలోచన దాదాపు పదేళ్ల క్రితమే నాకు తట్టింది. దానిని రకరకాలుగా మార్పులు చేసి చివరికి ఇలా మీ ముందుకు ఓ సినిమా రూపంలో తీసుకు వస్తున్నాను. 'చెక్‌' తరహా చిత్రాలు ఇంతకు ముందు రాలేదనే చెప్పాలి. చిత్రబృందం కూడా ఎంతో చక్కగా కుదిరారు. అందరూ అద్భుతంగా పనిచేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ పనితీరు అందరికీ నచ్చుతుంది.

సూపర్‌ స్క్రీన్‌ ప్లే..

నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా స్క్రీన్‌ప్లే ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. బాగా తెలివైన ఓ అబ్బాయి.. అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం తన తెలివిని ఉపయోగించే క్రమంలో అనుకోకుండా జైలు జీవితాన్ని గడపాల్సి వస్తే.. అక్కడి వెళ్లాక అతను ఎలా మారతాడు? ఏం అయ్యింది? అనేది ఈ సినిమాలో చక్కగా చూపించాం.

70 శాతం అక్కడే..

'చెక్‌' సినిమాలో 70 శాతం వరకూ జైలు సీక్వెన్స్‌ ఉంటుంది. సాధారణంగా అయితే ఆ సన్నివేశాలను మేము ఇంకా కొంచెం తగ్గించాలని అనుకున్నాం. కాకపోతే కరోనా కారణంగా బయట ప్రాంతాలకు వెళ్లలేక ఆ సీన్స్‌ మరింత పెంచాల్సి వచ్చింది. అయితే ఈ జైలు సెట్‌, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే.

check
చెక్​

రకుల్‌ ఓ భయస్తురాలు..

ఈ సినిమాలో రకుల్‌ లాయర్‌ పాత్ర పోషించారు. ఓ భయస్తురాలైన అమ్మాయి.. ఎలా ధైర్యవంతురాలిగా మారింది. ఉగ్రవాది అనే ముద్రపడిన ఓ వ్యక్తి కేసును ఆమె ఎలా టేకప్‌ చేసింది. చివరికి ఆ వ్యక్తిని ఆమె ఎలా నమ్మింది. ఇలాంటి విషయాలను చాలా చక్కగా చూపించాం. రకుల్‌ నటన కూడా బాగా కుదిరింది.

నితిన్‌కు ఇది సెట్‌ అయ్యింది..

నితిన్‌తో నేను ఒక సినిమా చేయాల్సి ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అలాంటి సమయంలో ఆయన కోసం రెండు కథలు రాశాను. అందులో చెక్‌ అయితే ఆయనకు బాగా నప్పుతుందని ఆలోచించా. నితిన్‌ కూడా ఓకే చేయడం వెంటనే పట్టాలెక్కించేశాం.

ప్రియానే టర్నింగ్‌ పాయింట్‌..

ప్రియాప్రకాశ్‌ వారియర్‌ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించారు. ఆమె పాత్ర ఓ టర్నింగ్‌ పాయింట్‌. ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్లో హీరో ప్రియురాలిగా ఆమె కనిపిస్తుంది. ఆమె వల్లే ఈ కథ మలుపు తీసుకుంటుంది. ఆమె చక్కగా నటిస్తుంది. అలాగే, తను బాగా పాటలు పాడుతుంది కూడా.

check
చెక్​

దర్శకుడిపై నిర్మాతకు నమ్మకం

ఆనంద్‌ ప్రసాద్‌ మంచి నిర్మాత. ఆయన 100 శాతం మనపై నమ్మకం ఉంచుతారు. మొదట కథ వింటారు. కథ నచ్చితే.. నాకు తెలిసి మళ్లీ ఫైనల్ కాపీ చూస్తారు. దర్శకుడిపై అంత నమ్మకం పెడతారు. ఆయనతో చిన్న సమస్య కూడా ఉండదు. వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి వెనుక ఉండి నడిపిస్తుంటారు.

check
చెక్​ చిత్రబృందం

చాలా జైళ్లను పరిశీలించాం

మా సినిమాలో జైలు, ఆ యూనిఫామ్ పూర్తిగా కల్పితం. గద్వాల్ జైలు అని పెట్టాం. దానికి కారణం ఏంటంటే.. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఓ ఏడాది పాటు అన్ని జైళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించాం. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తాయి కనుక చూడటానికి అనుమతులు ఇవ్వడం లేదు. జైలులో విధానాలపై మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. అంటే... తీవ్రవాదులను ఎలా తీసుకువెళతారు? ఎలా పెడతారు? వంటి విషయాలు చెప్పడానికి ఓపెన్‌గా లేరు.

'చెక్' కొత్త పాయింట్‌. అయినా.. యాక్షన్ సహా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎమోషనల్ థ్రిల్లర్ కనుక ఎక్కువ పాటలు అవసరం లేదని అనుకున్నాం. పాటలు తప్ప మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. చూసిన వాళ్లు అందరూ బాగా వచ్చిందని అంటున్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. నేను తీసిన మిగిలిన సినిమాలు కాస్త నిరాశపరిచి ఉండవచ్చు. ఈ సినిమాకు ఆ ఛాన్స్‌ లేదు. ఫిబ్రవరి 26న ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది. ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమాకి ముందే రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరే సినిమా ఇంకొకటి చేయాలి'

ఇదీ చూడండి: రకుల్ విషయంలో షాకైన హీరో నితిన్

ఇదీ చూడండి: నితిన్ మూడు సినిమాలు.. రాబోయే ఆరు నెలల్లో విడుదల

ఇదీ చూడండి: 'చెక్​ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.