ETV Bharat / sitara

సుశాంత్ కేసులో పోలీస్ స్టేషన్​కు దర్శకుడు భన్సాలీ - sushanth latest news

కథానాయకుడు సుశాంత్ సుసైడ్ విషయంతో సంబంధమున్న ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు భన్సాలీ స్టేట్​మెంట్​ను పోలీసులు రికార్డు చేశారు.

సుశాంత్ కేసులో పోలీస్ స్టేషన్​కు దర్శకుడు భన్సాలీ
సుశాంత్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ
author img

By

Published : Jul 6, 2020, 1:58 PM IST

బాలీవుడ్​ యువహీరో సుశాంత్ ఆత్మహత్యతో సంబంధమున్న ఆరోపణలతో పలువురు నటీనటుల్ని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఈ క్రమంలో నేడు, బాంద్రా పోలీస్ స్టేషన్​కు చేరుకున్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. తన స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు.

ఇప్పటికే సుశాంత్ మృతితో సంబంధమున్న 28 మంది వ్యక్తులను ప్రశ్నించి, ఆ సమాచారాన్ని రికార్డు చేశారు బాంద్రా పోలీసులు. ఈ నటుడు ఎందుకు సుసైడ్ చేసుకున్నాడో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

జున్ 14న సొంత అపార్ట్​మెంట్​లో ఉరి వేసుకోవడం వల్ల మరణించాడు సుశాంత్. అయితే బాలీవుడ్​లోని నెపోటిజమ్​ ఈ ఘటనకు ప్రధాన కారణమని, పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు అంటున్నారు.

శుద్ద్ దేశీ రొమాన్స్, రబ్తా, చిచ్చోరే, కేదార్​నాథ్, సోన్​చిరియా లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుశాంత్.. ధోనీ బయోపిక్​తో సినీ వీక్షకులతో పాటు క్రీడా ప్రేమికుల మనసుల్లో చోటు సంపాదించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.