ETV Bharat / sitara

బాలయ్యతో తొడ గొట్టించి.. చిరుతో మీసం మెలేయించి - Gopal Birthday special story

మన కథానాయకులను మాస్​ కోణంలో ఆవిష్కరించి తనకంటూ ఓ మార్క్​ ఉందని నిరూపించుకున్నారు ప్రముఖ దర్శకుడు బి. గోపాల్​. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

gopal
బీగోపాల్​
author img

By

Published : Jul 24, 2020, 6:01 AM IST

Updated : Jul 24, 2020, 8:46 AM IST

వాణిజ్య పరంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో బి.గోపాల్‌ ఒకరు. 'బొబ్బిలిరాజా', 'లారీ డ్రైవర్‌', 'అసెంబ్లీ రౌడీ', 'చినరాయుడు', 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌', 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు', 'ఇంద్ర'... ఇలా బాక్సాఫీసుని కళకళలాడించిన చిత్రాలెన్నో ఆయన్నుంచి వచ్చాయి.

ఒకప్పుడు బి.గోపాల్‌ నుంచి సినిమా వస్తుందనగానే, రికార్డుల గురించి మాట్లాడుకోవడం మొదలయ్యేది. ఎక్కువగా అగ్ర కథానాయకులతో సినిమాలు తెరకెక్కించిన ఈయన... వాళ్లని మాస్‌ కోణంలో ఆవిష్కరించడంలోనూ, అభిమానుల్ని మెప్పించడంలోనూ తనకంటూ ఒక మార్క్‌ ఉందని నిరూపించారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

gopal
బీగోపాల్​

బెజవాడ గోపాల్​

బి. గోపాల్‌ అసలు పేరు బెజవాడ గోపాల్‌. ప్రకాశం జిల్లా, టంగుటూరు దగ్గర ఎమ్‌.నిడమర్రు గ్రామంలో వెంకటేశ్వర్లు, మహాలక్ష్మి దంపతులకి జన్మించారు.‌ కారుమంచిలో విద్యాభ్యాసం చేశారు. ఒంగోలులోని సి.ఎస్‌.ఆర్‌శర్మ కాలేజీలోనూ చదువుకున్నారు. తండ్రి అంగీకారంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన పి.సి.రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు.

అక్కడ రెండు చిత్రాలు చేసిన అనంతరం ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దగ్గర 'అడవిరాముడు' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. 12 ఏళ్ల పాటు ఆయన దగ్గరే 'దేవత', 'జస్టిస్‌ చౌదరి', 'అగ్ని పోరాటం' తదితర చిత్రాలకి పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ప్రముఖ నిర్మాత డీ రామానాయుడు దృష్టిలో పడిన గోపాల్​ ఆయన సంస్థలో, 'ప్రతిధ్వని' చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నారు.

ఆ తర్వాత రామానాయుడు సంస్థలోనే 'ఇన్సాఫ్‌ కి ఆవాజ్‌' అనే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. 1987లో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున ప్రధాన పాత్రధారులుగా 'కలెక్టర్‌గారి అబ్బాయి' తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు.

gopal
బీగోపాల్​

'రక్తతిలకం', 'విజయ్‌', 'స్టేట్‌రౌడీ', 'లారీడ్రైవర్‌', 'బొబ్బిలిరాజా', 'చినరాయుడు', 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌', 'మెకానిక్‌ అల్లుడు', 'కలెక్టర్‌ గారు', 'అడవిలో అన్న'... ఇలా వరుసగా చిత్రాలు తెరకెక్కించారు. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కించిన 'వంశీ', ఎన్టీఆర్‌తో తీసిన 'అల్లరి రాముడు', 'నరసింహుడు', బాలకృష్ణతో తీసిన 'పల్నాటి బ్రహ్మనాయుడు', ప్రభాస్‌తో తీసిన 'అడవిరాముడు' చిత్రాలు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఆ ప్రభావం బి.గోపాల్‌ కెరీర్‌పై పడింది.

1989లో హిందీలో సంజయ్‌ దత్‌ కథానాయకుడిగా 'కనూన్‌ అప్నా అప్నా' అనే చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు గోపాల్‌. 'ప్రతిధ్వని' చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు.

ఇది చూడండి : 'టెనెట్'​ సినిమా విడుదల థియేటర్​లోనే..?

Last Updated : Jul 24, 2020, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.