ETV Bharat / sitara

'రెండేళ్ల కష్టానికి ఫలితం దక్కింది'

"క్షీరసాగర మథనం" చిత్రం సెక్సెస్​పై ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు అనిల్ పంగులూరి. తన రెండేళ్ల కష్టానికి ఫలితం లభించిందని అన్నారు. అనిల్ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు.

Kshirasagara Madhanam movie
క్షీరసాగర మథనం
author img

By

Published : Aug 7, 2021, 1:23 PM IST

Updated : Aug 7, 2021, 2:18 PM IST

రెండేళ్లు ఎంతో ఇష్టంగా కష్టపడి రూపొందించిన "క్షీరసాగర మథనం" చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తుండడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి. అనిల్ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

"క్షీర సాగర విజయం నా ఒక్కడిదే కాదు.. మనీ కోసం కాకుండా మనసు పెట్టి పని చేసిన యూనిట్ మెంబర్స్ అందరిదీ"

-డైరెక్టర్ అనిల్ పంగులూరి

అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు చెబుతున్నప్పటికీ... ఓవరాల్ గా అందరూ మెచ్చుకుంటున్నారని అనిల్ అన్నారు. మానస్, అక్షత, గౌతమ్ శెట్టి, చరిష్మా, మహేష్ లతోపాటు ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకుంటోందని చెప్పారు. అజయ్ అరసాడ సంగీతానికి, సంతోష్ శానమోని కెమెరా వర్క్ కి చాలా మంచి మార్కులు వేస్తున్నారని అనిల్ ఆనందం వ్యక్తం చేశారు. క్యారెక్టర్ అంటే వర్జినిటీ కాదని చెప్పడాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పారు. అయితే ఈ విజయం తన ఒక్కడికే సొంతం కాదని, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ సమానంగా చెందుతుందని అనిల్ పేర్కొన్నారు. తన తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పంగులూరి తెలిపారు.

ఇదీ చదవండి:చిరు 'ఆచార్య' విడుదల ఎప్పుడు?

Last Updated : Aug 7, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.