ETV Bharat / sitara

నాలుగేళ్లు ఆస్పత్రిలోనే.. ఆమె వల్లే బతికా!: దర్శకుడు - wow show latest episode

Amma rajasekhar in WOW Show: అనారోగ్యం వల్ల ఆస్పత్రిలోనే నాలుగేళ్ల పాటు ఉండాల్సి వస్తే.. ఆ సమయంలో తన తల్లి అండగా నిలిచిందని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మరాజశేఖర్​. ఇంకా తన కెరీర్​ గురించి పలు విషయాలను తెలిపారు.

amma rajasekhar
అమ్మ రాజశేఖర్​
author img

By

Published : Nov 24, 2021, 7:26 PM IST

ఈ ప్రపంచంలో 'అమ్మ' ప్రేమకు ఏదీ సాటి రాదు. ఎందుకంటే తన పిల్లలకు ఆమె ఇచ్చే ధైర్యం, ప్రోత్సాహం, ఆమెకు ఉన్న సహనం, ఓర్పు అలాంటింది. సాధారణంగా పిల్లలకు ఏదైనా అయితే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వారికి ఏదైనా క్లిష్ట సందర్భం ఎదురైతే తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా చివరి వరకు ఉంటుంది. తాజాగా ఈటీవీలో నటుడు సాయికుమార్​ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'వావ్'​ షోకు అతిథిగా హాజరైన అమ్మరాజశేఖర్​ చెప్పిన ఓ విషయం 'అమ్మ ప్రేమ'కు అద్దం పడుతోంది(amma rajasekhar about his mother). అనారోగ్యం వల్ల నాలుగేళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తే.. ఆ సమయంలో ఎంతో ఓర్పు, సహనంతో తనకు సేవ చేస్తూ బతికించుకుందని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు రాజశేఖర్. తన తల్లి గురించి ఆయన చెప్పిన మాటలు మనసును కదలించాయి. అమ్మ మీద ప్రేమతోనే అమ్మ రాజశేఖర్​ పేరు పెట్టుకున్నట్లు తెలిపారు!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"అసలు పేరు రాజవీర పాండియన్​. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్​గా మార్చుకున్నా. నా జీవితంలో నాలుగేళ్లు ఆస్పత్రిలో ఉన్నా. నా కోసం మా అమ్మ కూడా హాస్పిటల్​లోనే ఉంది. మా ఇల్లు మెయిన్​రోడ్​లో ఉంటుంది. అక్కడ ఇసుక​ ఉంటుంది. దాన్ని చిన్నప్పుడు తినేవాడిని. దీనితో అనారోగ్యం పాలయ్యా. నాలుగేళ్లప్పుడు ఆస్పత్రికి వెళ్లా. ఎనిమిదేళ్ల సమయంలో తిరిగి వచ్చాను. ఆ తర్వాత ఎల్​కేజీ చదివాను. అనారోగ్యం వల్ల ఎత్తు కూడా పెరగలేకపోయా. నా ఫ్రెండ్​(స్పోర్ట్స్​ మెన్​) వల్ల ఎక్సర్​సైజ్​లు నేర్చుకుని చేశాను. దాంతో ఈమాత్రం ఎత్తు పెరిగాను. లేకపోతే పొట్టిగానే ఉండిపోయావాడిని. దర్శకుడు కృష్ణవంశీ తొలిసారి 'గోవింద గోవింద' సాంగ్​ కోసం నాపేరును అమ్మ రాజశేఖర్​గా మార్చారు."

కొరియోగ్రాఫర్​గా కెరీర్​ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారారు అమ్మ రాజశేఖర్(amma rajasekhar career)​. తమిళనాడుకు చెందిన ఈయన 2006లో గోపిచంద్​తో తెరకెక్కించిన 'రణం' సినిమా బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఆ తర్వాత రవితేజతో చేసిన 'ఖతర్నాక్', నితిన్​తో చేసిన 'టక్కరి'​ అంతగా ఆకట్టకులేకపోయాయి.

ఇదీ చూడండి: 'ఆచార్య' అప్డేట్​.. 'సిద్ధ' టీజర్ రిలీజ్​కు డేట్ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.