మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారు 'ఎఫ్2', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇటీవలే జరిగిన ఓ టీవీ లైవ్ చాట్‌లో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నారు. ఇప్పటికే చిరు కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
"మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలన్నది నా కల. ఆయన కోసం ఇప్పటికే ఓ కథ రాస్తున్నా. లాక్డౌన్ పూర్తయిన వెంటనే వెళ్లి కథ వినిపిస్తా. నా ప్రాజెక్టును ఆయన ఓకే చేస్తారని భావిస్తున్నాను. దీనితో పాటే నందమూరి బాలకృష్ణ కోసమూ ఓ స్టోరీ అనుకుంటున్నా"
-అనిల్ రావిపూడి, దర్శకుడు
ప్రస్తుతం అనిల్.. 'ఎఫ్3' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' చేస్తున్న చిరు.. ఆ తర్వాత వరుసగా డైరెక్టర్లు సుజీత్, బాబీ, మెహర్ రమేశ్‌లతో కలిసి పనిచేయనున్నారు.
ఇదీ చూడండి : యువ దర్శకుడికి అవకాశమిచ్చిన బాలకృష్ణ!