ETV Bharat / sitara

చిట్టి.. నటనలోనే కాదు అన్నింటిలోనూ మేటి! - ఫరియా అబ్దుల్లా

నవ్వుతో మాయచేసి తొలి సినిమాతోనే అభిమానుల్ని సొంతం చేసుకుంది 'జాతిరత్నాలు' హీరోయిన్​ ఫరియా అబ్దుల్లా. అయితే తనకు చిన్ననాటి నుంచే నటనపై అవగాహన, ఆసక్తి ఉన్నాయని చెప్పిన ఈ భామ.. ఎన్నో స్టేజ్​ ప్రదర్శనలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఎప్పటికైనా దర్శకత్వం వహిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

chitti
చిట్టి
author img

By

Published : May 23, 2021, 10:38 AM IST

'జాతి రత్నాలు' చూసినవాళ్లంతా ఆ సినిమాలో రత్నాలు ముగ్గురు కాదు, నలుగురు అని తేల్చిచెప్పారు. ఆ నాలుగో రత్నం హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా. కొందరైతే ఈ 'చిట్టి' రువ్విన చిరునవ్వుల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. సినిమాలకు కొత్త కావొచ్చుకానీ, నటనలో మాత్రం సుదీర్ఘ అనుభవం ఉందంటున్న ఈ హైదరాబాదీ ఇంకా ఏం చెబుతోందంటే...

నాటకరంగం నుంచి...

స్కూల్‌ రోజుల్లో ఏటా సమ్మర్‌ క్యాంపులకు హాజరవుతూ యాక్టింగ్‌, పెయింటింగ్‌, డ్యాన్స్‌లాంటివి నేర్చుకునేదాన్ని. టెన్త్‌ తర్వాత ఇంటర్మీడియెట్‌కు కాలేజీలో చేరలేదు. హోమ్‌ స్కూలింగ్‌ పద్ధతిలో చదువుకున్నా. ఆ సమయంలో పెయింటింగ్‌ క్లాసులకు కాచీగూడ, సాహిత్యం క్లాసులకు లింగంపల్లి వెళ్లేదాన్ని. తర్వాత నాటకరంగంపైన ఆసక్తి కలిగింది. ఏడేళ్లుగా నగరంలోని వివిధ నాటక సంస్థల్లో భాగమై ఎన్నో పాత్రలు పోషించాను. కొన్ని నాటకాలు రాయడం సహా దర్శకత్వం వహించాను కూడా.

అలా వచ్చింది ఛాన్స్‌...

లయోలా కాలేజీ నుంచి మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేశా. తర్వాత కొన్నాళ్లకు ఓ కార్యక్రమం కోసం నాగ్‌ అశ్విన్‌ లయోలా కాలేజీకి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసి వెళ్లి కలిశా. ఓ ప్రాజెక్టు చేస్తున్నాం, ఆసక్తి ఉంటే ఆఫీసులో కలవమని చెప్పారు. వెళ్లాక ఆడిషన్‌ చేసి ఎంపికచేశారు. నాటకరంగంలో ఏడేళ్ల అనుభవం ఉంది. షార్ట్‌ఫిల్మ్స్‌, వెబ్‌సిరీస్‌లలో నటించాను. ఆ అనుభవం నాకు బాగా పనికొచ్చింది. స్టేజీమీద ప్రదర్శన ఇవ్వడంవల్ల ఏకాగ్రత బాగా అలవడుతుంది. అది నటనకు చాలా అవసరం.

డాన్స్‌ అంటే ఇష్టం...

ఇంట్లో అందరికీ కళలంటే ఇష్టం. ప్రత్యేకించి నటన, డాన్స్‌ అంటే ప్రత్యేక ఆసక్తి. అయితే వాళ్లలో ఎవరూ బయటకు వచ్చి ప్రదర్శనలు ఇవ్వలేదు, సినిమాల్లో నటించలేదు. నేను కడుపులో ఉన్నపుడు అమ్మ డాన్స్‌ ప్రాక్టీసు చేసేదట. అప్పుడే నాక్కూడా డాన్స్‌పైన ఆసక్తి ఏర్పడిందేమో. జాతి రత్నాల్లో హీరో నాకు డాన్స్‌ నేర్పుతాడు. కానీ నిజ జీవితంలో నేను డాన్సర్‌ను. హిప్‌ హాప్‌, బెల్లీ డాన్స్‌, ఫ్రీ స్టయిల్‌ డాన్సింగ్‌ లాంటి పాశ్చాత్య నృత్యాలతోపాటు కథక్‌ కూడా నేర్చుకున్నా. అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌, కవిత్వం కూడా ఇష్టం.

fariya abdullah
ఫరియా అబ్దుల్లా

ఓటీటీకి ఓటేశా కానీ!

జాతిరత్నాలుకు సంబంధించిన షూటింగ్‌ 95శాతం 2019లోనే పూర్తయిపోయింది. తర్వాత కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్‌ రిలీజ్‌ ఆలస్యమైంది. ఆ సమయంలో 'ఓటీటీలో రిలీజ్‌ చేయడంపైన మీ అభిప్రాయం ఏంట'ని టీమ్‌ అందరినీ అడిగారు నిర్మాత నాగ్‌ అశ్విన్‌. అప్పటికే ఆ సినిమా గురించి చాలా రోజులుగా వేచి చూడ్డంవల్ల ఓటీటీకే ఓటు వేశాను. కానీ మెజారిటీ అభిప్రాయం మేరకు థియేటర్‌ రిలీజ్‌ కోసం ఆగారు. సినిమా చూసినంతసేపూ కడుపుబ్బా నవ్వుతారని తెలుసు కానీ ఈ స్థాయిలో ప్రేక్షకులు స్పందిస్తారని ఊహించలేదు. థియేటర్‌లో ఈలలూ, అరుపులూ బయట ప్రశంసలూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

తెలుగు నేర్చుకున్నా...

జాతిరత్నాలు షూటింగ్‌ సమయం ఎంతో సరదాగా గడిచిపోయేది. నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌, దర్శకుడు అనుదీప్‌... ఇలా టీమ్‌లో అందరూ జోవియల్‌గా ఉండేవారు. ఆ వైబ్‌ ఎంతో నచ్చింది. ఇంట్లో హిందీ, ఉర్దూ మాట్లాడుతుంటాం. ఎప్పట్నుంచో తెలుగు నేర్చుకోవాలని అనుకునేదాన్ని. ఈ సినిమావల్ల ఆ అవకాశం వచ్చింది. డబ్బింగ్‌ కూడా నేనే చెప్పా.

డైరెక్షన్‌ చేస్తా...

తెలుగులో ఇప్పటికే కొత్త సినిమా కథలు వింటున్నా. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది నా ఉద్దేశం. తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధం. సినిమా అనే కాదు, ఓటీటీలో వచ్చే వెబ్‌ సిరీస్‌లలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చేస్తా. నాకు నచ్చిన పాత్రలు రాకుంటే, ఇష్టమైన రంగాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో వేటినైనా ఎంచుకుంటా. సినిమాల్లోనే ఉంటే ఏదో ఒకరోజు డైరెక్షన్‌ చేస్తా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'జాతిరత్నాలు' చిట్టి.. లక్ష్మి పటాస్ లాంటి నవ్వుతో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.