దిగ్గజ నటుడు దిలీప్ కుమార్(DilipKumar) మరోసారి అనారోగ్య సమస్యలకు గురయ్యారు. దీంతో ఆయనను అత్యవసర విభాగానికి(ICU) తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న దిలీప్‌కుమార్‌ను ముందస్తు జాగ్రత్తగా ఐసీయూలో చేర్చారు.
కొద్ది రోజులుగా దిలీప్.. శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల జూన్ 6న ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం వల్ల ఐసీయూకు తరలించారు.
1944లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'జ్వార్ భాటా' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన దిలీప్ కుమార్.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన మధుమతి, దేవదాస్, ఆన్, నయా దవుర్, రామ్ ఔర్ శ్యామ్ సినిమాలు ఎన్నటికీ మర్చిపోలేనివి! 1998లో వచ్చిన 'కిలా'.. ఆయన నటించిన చివరి చిత్రం. ఈయనను దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ అవార్డులు కూడా వరించాయి.
న్యుమోనియాతో
సీనియర్ నటుడు నసీరుద్దీన్ షాను ఆస్పత్రిలో చేర్పించారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య రత్న పథక్ షా తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.
నసీరుద్దీన్ షా.. 1975లో 'నిషాంత్' సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. అనంతరం పలు హిట్ సినిమాల్లో నటించారు. దర్శకుడిగా పలు లఘచిత్రాల్ని తెరకెక్కించారు. టీవీషోలకు హోస్ట్‌గాను వ్యవహరించారు.
ఇదీ చూడండి: Dilip kumar: దిలీప్ కుమార్ ఇంకా ఆక్సిజన్ సపోర్ట్‌పైనే