ETV Bharat / sitara

ఒక్క టేక్​లో పాటను​ పూర్తి చేసిన సుశాంత్ - సుశాంత్ దిల్​ బెచారా

సుశాంత్ సింగ్ 'దిల్​ బెచారా' సినిమా నుంచి టైటిల్​ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది చిత్రబృందం. ఇందులో అద్భుతంగా డ్యాన్స్ చేసి, చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నాడీ నటుడు.

ఒక్క టేక్​లో పాట డ్యాన్స్​ పూర్తి చేసిన సుశాంత్
దిల్ బెచారా టైటిల్ గీతం
author img

By

Published : Jul 10, 2020, 3:03 PM IST

బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ చివరి చిత్రం 'దిల్ బెచారా' ట్రైలర్​ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో టైటిల్​ గీతాన్ని విడుదల చేశారు. ఇందులోనూ తన గ్రేస్, చిరునవ్వుతో అభిమానులు మనసుల్ని మరోసారి దోచుకున్నాడు సుశాంత్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే 2 నిమిషాల 44 సెకన్లు ఉన్న ఈ పాట మొత్తాన్ని సింగిల్​ టేక్​లో పూర్తి చేయగా, అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు సుశాంత్. ప్రచారం చిత్రంలానే ఈ గీతానికి లైకులు వర్షం కురుస్తుండటం విశేషం.

2014లో వచ్చిన హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామా 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌'కు రీమేక్‌ 'దిల్‌ బెచారా'. ఇద్దరు క్యాన్సర్‌ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథతో దీనిని తెరకెక్కించారు. సంజన సంఘీ హీరోయిన్​గా పరిచయమవుతోంది. సైఫ్‌ అలీ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించగా, ముఖేశ్ చబ్రా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జులై 24 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.