ETV Bharat / sitara

'దిల్​ బెచారా' చిత్రం నుంచి 'ఖుల్కే జీన్​ కా' సాంగ్ రిలీజ్​ - సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ లేటెస్ట్​ న్యూస్​

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా'. ఈ సినిమాలోని మరో పాటను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ' ఖుల్కే జీన్​ కా' అనే సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.

Dil Bechara new song: Sushant Singh Rajput, Sanjana Sanghi celebrate life in Khulke Jeene Ka
దిల్​ బెచారా చిత్రంలో 'ఖుల్కే జీన్​ కా' వీడియో రిలీజ్​
author img

By

Published : Jul 19, 2020, 3:35 PM IST

దివంగత నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్​పుత్‌ చివరిసారిగా నటించిన చిత్రం 'దిల్‌ బెచారా'. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పాటలు విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. సంజనా సంఘీ కథానాయిక. తాజాగా ఈ మూవీలోని మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'ఖుల్కే జీన్​ కా' అనే సాంగ్​కు మ్యూజిక్​ మాస్ట్రో ఎ.ఆర్​ రెహమాన్​ స్వరాలు సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3 నిమిషాల 25 సెకన్ల వీడియోలో హీరోహీరోయిన్లు ఇద్దరూ కలిసి వీధుల్లో సరదాగా గడపడం, వారి చిత్రాలను స్కెచ్​ వేయించుకోవడం, కలిసి భోజనం చేస్తూ.. ఆస్వాదించడం వంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అమితాబ్​ భట్టాచార్య రచించిన ఈ పాటను అర్జిత్​ సింగ్​, షాషా తిరుపతి ఆలపించగా.. ఎ.ఆర్​ రెహమాన్​ స్వరపరచిన తమిళ్​ సాంగ్​ 'కన్నిల్​ ఓరు తాలి' నుంచి ఈ స్వరాన్ని గ్రహించారు.

2014లో హాలీవుడ్‌లో విడుదలైన రొమాంటిక్‌ డ్రామా 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌' చిత్రానికి రీమేక్‌గా 'దిల్‌ బెచారా' నిర్మితమైంది. ముఖేష్‌ ఛబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలై కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈనెల 24న హాట్‌స్టార్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.