ప్రముఖ కథానాయకుడు ధనుష్-దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో సినిమా అంటే కోలీవుడ్‌లో భారీ అంచనాలుంటాయి. వాస్తవికతను ఉట్టిపడేలా వీరి చిత్రాలు తెరకెక్కిస్తారు. 2018లో వీరి కాంబోలో వచ్చిన 'వడచెన్నై' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తర చెన్నైలో జరిగే నేరాల నేపథ్య కథ దీనిని తీశారు. ఆ సమయంలోనే రెండో భాగాన్ని రూపొందించాలని భావించారు. అయితే 'అసురన్'ను తీసి, హిట్ కొట్టారు. ఇప్పుడు 'వడచెన్నై 2'ను తెరకెక్కించాలని నిర్ణయానికి వచ్చారు.
అయితే ఈ సీక్వెల్‌ను వెబ్ సిరీస్‌గా తీసుకురానున్నట్లు దర్శకుడు వెట్రిమారన్ తెలిపారు. ధనుష్‌తో పాటు ఆండ్రియా, ఐశ్వర్య రాజేష్, అమీర్, సముద్రఖని వంటి భారీ తారాగణంతో వస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే. సూరి హీరోగా ఓ సినిమా.. సూర్యతో 'వాడివాసల్'ను తెరకెక్కించిన తర్వాతే 'వడచెన్నై 2' ఆరంభం కానుంది.
ఇదీ చూడండి : 'జూనియర్ సింగర్స్ నన్ను దారుణంగా ఇమిటేట్ చేశారు'