తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన 'యుగానికి ఒక్కడు' సినిమా సీక్వెల్‌పై ప్రకటన వచ్చేసింది. న్యూయర్ సందర్భంగా దర్శకుడు సెల్వరాఘవన్.. ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి భాగంలో కార్తి నటించగా, సీక్వెల్లో ధనుష్ చోళ రాజుగా కనిపించనున్నారు. 2024లో థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.
చోళులు, పాండ్యులకు సంబంధించిన కథతో 'యుగానికి ఒక్కడు' తీశారు. కార్తి, ఆండ్రియా, రీమాసేన్ ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోని ఈ చిత్రం.. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కల్ట్ క్లాసిస్గా మారింది. గ్రాఫిక్స్, మ్యూజిక్ ఇందులో కీలకంగా నిలిచాయి.
అలానే సోదరులు ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత కలిసి పనిచేస్తుండటం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సీక్వెల్ పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
ఇవీ చదవండి: