ETV Bharat / sitara

రణ్​వీర్​ కోసం బాలీవుడ్​కు దేవిశ్రీప్రసాద్​! - రణ్​వీర్​ సింగ్​ రోహిత్​శెట్టి

'రాధే' సినిమా నుంచి ఇటీవలే విడుదలైన 'సీటీమార్​' రీమిక్స్​​ సాంగ్​ హిట్​తో దేవిశ్రీప్రసాద్​కు బాలీవుడ్​లో విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది. దీంతో అతడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. రణ్​వీర్​ సింగ్​, రోహిత్​ శెట్టి కాంబినేషన్​లో రూపొందుతోన్న 'సర్కస్​'లో దేవీ రెండు పాటలకు స్వరాలకు సమకూర్చనున్నారని ప్రచారం జరుగుతోంది.

Devi Sri Prasad comes on board Ranveer Singh - Rohit Shetty starrer Cirkus
రణ్​వీర్​ కోసం బాలీవుడ్​కు దేవీశ్రీప్రసాద్​!
author img

By

Published : May 3, 2021, 7:13 AM IST

Updated : May 3, 2021, 8:56 AM IST

'సీటీమార్‌' పాట బాలీవుడ్‌ సినీప్రియుల్ని ఉర్రూతలూగిస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' చిత్రంలోని ఈ సాంగ్​కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్​ అందించారు. ఇప్పుడీ పాటనే సల్మాన్‌ ఖాన్‌ కోరిక మేరకు 'రాధే' సినిమాలో రీమిక్స్‌ చేశారు దేవిశ్రీ. దీంతో ఇప్పుడు దేవిశ్రీకి హిందీలోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది.

ఈ క్రమంలోనే దర్శకుడు రోహిత్‌ శెట్టి నుంచి దేవిశ్రీప్రసాద్​కు పిలుపు అందిందని సమాచారం. రోహిత్‌ ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌తో 'సర్కస్‌' చిత్రం తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయికలు. త్వరలో చిత్రీకరణ మొదలవుతుంది. ఇప్పుడీ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్‌ ఓ ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేస్తున్నారట.

ఈ పాటలో రణ్‌వీర్‌ సరసన దీపిక పదుకొణె ఆడిపాడనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఆయన ఈ సినిమాలో మరో రొమాంటిక్‌ గీతాన్ని స్వరపరచనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ రెండు పాటల్లో ఒకటి రికార్డింగ్‌ పూర్తయినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​తో అల్లు అర్జున్​ కొత్త చిత్రం!

Last Updated : May 3, 2021, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.