తృణముల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నూస్రత్ జహాన్ దుర్గాదేవి అవతారంతో ఇస్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనిపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పలు ఇస్లామిక్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మత సిద్ధాంతాలకు విరుద్ధంగా నూస్రత్ ప్రవర్తిస్తోందని.. భగవంతుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఆమె చేస్తున్న పనులు తమ మతంలో నిషేధమని పేర్కొన్నాయి. ఎప్పుడూ వివాదాల్లో నిలవడమే నూస్రత్కు ఇష్టమని.. పలువురు ఇస్లామిక్ గురువులు ఆరోపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
దుర్గాదేవి అవతారంలో పోస్ట్ చేయగా.. తనను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని నూస్రత్ పేర్కొన్నారు. తనకు అదనపు భద్రత కల్పించాలని భారత హైకమీషన్‌ను కోరారు. విదేశాంగ శాఖతో పాటు బంగాల్ ప్రభుత్వానికీ తన పరిస్థితిని తెలియజేశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం ఈమె లండన్‌లో ఉన్నారు.
నూస్రత్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమె సింధూరం ధరించి, దుర్గా పూజ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ఆరోపణలు ఎదుర్కొన్నారు.