బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్ క్యాన్సర్తో పోరాడుతూ నేడు(గురువారం) తుదిశ్వాస విడిచారు. ముంబయిలో ఉన్న రిషీ పార్థివ దేహాన్ని చివరిసారి చూసేందుకు దిల్లీలో ఉన్న ఆయన కుమార్తె రిథిమా దాదాపు 1400 కి.మీ మేర ప్రయాణం చేసి, ముంబయి చేరుకోనున్నారు.
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఆమె, ముంబయి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది దిల్లీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటి కమీషనర్ ఆర్పీ మీనా తెలిపారు. రిథిమాతో పాటు మరో ఐదుగురు వెళ్లేందుకు అవకాశమిచ్చామన్నారు.