జూన్ 5న విడుదల కావాల్సిన సల్మాన్‌ఖాన్ చిత్రం భారత్ విడుదలపై స్టే విధించాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది దిల్లీ హైకోర్టు. దేశం పేరునే చిత్రానికి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. జూన్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రంపై పిటిషన్ వేయడం ఉచిత ప్రచారం కోసమేనని వ్యాఖ్యానించింది.
వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించకమునుపే మీడియాకు విడుదల చేయడంపై పిటిషనర్ వికాస్ త్యాగిని మందలించింది.
స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకూ కథాంశంగా తీసుకుని సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ భారత్ చిత్రాన్ని తెరకెక్కించారు.
పిటిషనర్ వాదనలివే
పేర్లు, చిహ్నాల దుర్వినియోగం చట్టం కింద చిత్రానికి భారత్ అని నామకరణం చేయడం సరికాదని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
"ఘనమైన మన దేశ పేరును ఓ పాత్రకు, సినిమాకు పెట్టడం సరికాదని భావిస్తున్నాను. మన సంప్రదాయం, రాజకీయ ముఖచిత్రాన్ని వక్రీకరించారు"
-వ్యాజ్యంలో పిటిషనర్
చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, నిర్మాణ సంస్థలు రియల్ లైఫ్ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ , కథానాయకుడు సల్మాన్ ఖాన్‌కు, కేంద్ర చిత్ర ధ్రువీకరణ సంస్థకు భారత్ చిత్రంపై సూచనలు చేయాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. చిత్రంలోని కథానాయకుడి పాత్రను దేశంతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: యుద్ధం ప్రారంభించిన 'ఆర్మీ మేజర్ మహేశ్'