ETV Bharat / sitara

దీపికా పదుకొణె కుటుంబానికి కరోనా - దీపికా పదుకొణె కరోనా

బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ దీపికా పదుకొణె కుటుంబానికి కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం వారు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. దీపిక తండ్రి మాత్రం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

deepika
దీపిక
author img

By

Published : May 4, 2021, 5:41 PM IST

Updated : May 4, 2021, 5:59 PM IST

కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా ఎందరో బాలీవుడ్​ సెలబ్రిటీలు వైరస్​ బారిన పడుతున్నారు. ఇప్పుడు స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె కుటుంబం కొవిడ్ బారిన పడింది. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణె (మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్​)​​, తల్లి ఉజాలా, సోదరి అనిశా పదుకొణెలకు పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్​ అకాడమీ డైరెక్టర్​ విమల్​ కుమార్​ తెలిపారు.

పదిరోజుల కిందట దీపిక ఇంట్లో వారందరికీ స్వల్ప లక్షణాలు కనిపించాయని, దీంతో వారు పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా తేలిందని విమల్​ వెల్లడించారు. వారందరూ స్వీయనిర్బంధంలోకి వెళ్లినట్లు చెప్పారు. అయితే ప్రకాశ్​కు మాత్రం జ్వరం తగ్గకపోవడం వల్ల ఇటీవల ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. మిగతావారు ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నట్లు స్పష్టం చేశారు.

దీపిక
deepika family

Last Updated : May 4, 2021, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.