దీపికా పదుకొణె.. బాలీవుడ్లో స్టార్డమ్ ఉన్న కథానాయిక. అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ప్రథమురాలు. ఆమె ఎక్కడికి వెళ్లినా జనకోలాహలం మొదలవుతుంది. సెల్ఫీలంటూ ఫ్యాన్స్ ఎగపడతారు. వీరిని అడ్డుకునే బాధ్యత బాడీగార్డ్ జలాల్దే. అయితే.. జలాల్ నెలజీతం ఎంతో తెలుసా..
1.2 కోట్ల వరకు..
దీపిక, రణ్వీర్ వివాహం చేసుకున్న తర్వాత వారి బాడీగార్డ్‌లలో జలాల్ ముందుంటాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా సోదరుడిలా కాపాడుతుంటాడు. జలాల్‌కు దీపిక రాఖీ కట్టిందంటేనే వారి మధ్య ఉన్న అన్యోన్య సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. జలాల్ నెలజీతం ఏడాదికి రూ.80 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
బాలీవుడ్లో ఒక్క దీపికకే కాకుండా.. పలువురు సెలబ్రిటీల బాడీగార్డ్ల జీతాలు కోట్లలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ జీతం నెలకు రూ.15లక్షల వరకు ఉంటుందని అంచనా. విరుష్క జోడీ బాడీగార్డ్ ప్రకాశ్‌కు ఏడాదికి రూ.1.2కోట్లు ఉంటుంది. షారుక్ ఖాన్ బాడీగార్డ్‌కు రూ.2.7 కోట్లు అని అంచనా.
దీపిక ప్రస్తుతం 83 మూవీలో నటిస్తోంది. 'ది ఇంటర్న్' హిందీ రీమేక్ 'ఫైటర్' సినిమాలోనూ కథానాయికగా ఉంది.