బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'ఓమ్ శాంతి ఓమ్' సినిమాతో దీపికా పదుకొణె హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తొలి సినిమా నుంచే ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ విమర్శలే తన ఎదుగుదలకు కారణమయ్యాయని దీపిక పేర్కొంది.
"19 ఏళ్లప్పుడు (ఓమ్ శాంతి ఓమ్ చిత్రానికి) చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాను. అప్పటికి అంతగా అహగాహన లేదు. అప్పుడు షారుక్, ఫరా ఖాన్ కొన్ని విషయాలను నేర్పించారు. ఆ సినిమా విడుదలైన తర్వాత నా పనితీరు పట్ల విమర్శలు ఎదుర్కొన్నాను. 'ఆమె ఓ మోడల్. ఆమె నటించలేదు' అంటూ నా యాసపై కామెంట్లు చేశారు. ఆ మాటలు నన్ను చాలా బాధించాయి"
- దీపికా పదుకొణె, బాలీవుడ్ నటి
విమర్శలు తనకు ఇంధనంలా పనిచేశాయని, దాని తర్వాత మరింతగా కష్టపడి, నాలోని నటనా నైపుణ్యాలను పెంచుకున్నానని పేర్కొంది.
దీపికా పదుకొణె.. చివకగా 'ఛపాక్'లో నటించింది. '83'తో పాటు.. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో ఈమె హీరోయిన్గా ఎంపికైంది.
ఇదీ చూడండి: రెండు సెకన్ల సీన్‌కు.. అన్ని గంటల కష్టమా!