హీరోయిన్ దీపికా పదుకొణె(deepika padukone movies).. గతంలో డిప్రెషన్‌తో బాధపడింది. ఆ విషయాన్ని అప్పుడే చెప్పిన భామ.. ఆ తర్వాత దాని నుంచి బయటపడింది. వైవాహిక జీవితం, సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. ఈ మధ్య 'కౌన్ బనేగా కరోడ్‌పతి 13'(kaun banega crorepati season 13) షోలో పాల్గొన్న దీపిక.. తను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న అనుభవాల్ని వెల్లడించింది.
"చాలాసార్లు నేను బతికేఉన్నానని అనిపించేది కాదు. కారణం లేకుండానే జీవిస్తున్నానని అనిపించింది. అయితే నా రోజువారీ కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దానిని నుంచి బయటపడ్డాను. ఈ సమయంలో మా అమ్మ నాకు ఎంతో తోడ్పాటుగా నిలిచింది" అని దీపిక తెలిపింది.
రణ్‌వీర్‌పై దీపిక ఫిర్యాదు
కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరాఖాన్‌తో కలిసి షోకు వచ్చిన దీపిక.. హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో(amitabh bachchan) కలిసి చాలా సందడి చేసింది. తన భర్త రణ్వీర్ సింగ్(ranveer singh) తనకు బ్రేక్‌ఫాస్ట్ వండిపెట్టడం లేదని దీపికా పదుకొణె.. బిగ్‌బీకి ఫిర్యాదు(నవ్వుతూ..) చేసింది.
![Deepika Padukone amitabh KBC 13](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13034099_kbc-13.jpg)
ఫుడ్ దొంగిలించిన అమితాబ్
అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన క్రేజీ విషయాన్ని దీపిక వెల్లడించింది. షూటింగ్లో ఆయన తన ఫుడ్ దొంగిలించేవారని పేర్కొంది. అయితే ఆమె తన ఫుడ్ ఎవరితోనూ అస్సలు షేర్ చేసుకోదు అని బిగ్‌బీ తెలిపారు.
ఇవీ చదవండి: