క్రీడల నేపథ్యంలో తెరకెక్కబోతున్న '83' చిత్రంలో బాలీవుడ్ హాట్ జంట కలిసి నటించనున్నారు. 1983 ప్రపంచ కప్ గెలుచుకున్న నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్, ఆయన భార్య రోమి దేవ్‌గా దీపికా వెండితెరపై కనువిందు చేయనున్నారు. సామాజిక మాధ్యమాల్లో రణ్వీర్ ఈ విషయాన్ని ప్రకటించాడు.
-
*drum roll*
— Ranveer Singh (@RanveerOfficial) June 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
All smiles as All-star @deepikapadukone joins the #83squad !!! 😁🙌🏽🌟@83thefilm @kabirkhankk 🏏 🎥 🎞 pic.twitter.com/pM5zhFyjtC
">*drum roll*
— Ranveer Singh (@RanveerOfficial) June 12, 2019
All smiles as All-star @deepikapadukone joins the #83squad !!! 😁🙌🏽🌟@83thefilm @kabirkhankk 🏏 🎥 🎞 pic.twitter.com/pM5zhFyjtC*drum roll*
— Ranveer Singh (@RanveerOfficial) June 12, 2019
All smiles as All-star @deepikapadukone joins the #83squad !!! 😁🙌🏽🌟@83thefilm @kabirkhankk 🏏 🎥 🎞 pic.twitter.com/pM5zhFyjtC
"83 బృందంలో నాతో పాటు దీపిక జత కలిసింది. ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు."
-రణ్వీర్ సింగ్
మరో పోస్ట్‌లో మరిన్ని విషయాలు పంచుకున్నాడు రణ్వీర్.
-
Who better to play My Wifey than My Wifey?! 😉❤@deepikapadukone plays Romi Dev in @83thefilm !!! 🏏🎥🎞
— Ranveer Singh (@RanveerOfficial) June 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Genius casting courtesy @kabirkhankk 😄🙌🏽 #83squad pic.twitter.com/saL8QdmYpE
">Who better to play My Wifey than My Wifey?! 😉❤@deepikapadukone plays Romi Dev in @83thefilm !!! 🏏🎥🎞
— Ranveer Singh (@RanveerOfficial) June 12, 2019
Genius casting courtesy @kabirkhankk 😄🙌🏽 #83squad pic.twitter.com/saL8QdmYpEWho better to play My Wifey than My Wifey?! 😉❤@deepikapadukone plays Romi Dev in @83thefilm !!! 🏏🎥🎞
— Ranveer Singh (@RanveerOfficial) June 12, 2019
Genius casting courtesy @kabirkhankk 😄🙌🏽 #83squad pic.twitter.com/saL8QdmYpE
"నా భార్య పాత్రలో నా భార్య తప్ప ఇంకెవరు బాగా చేయగలరు? 83 చిత్రంలో రోమి దేవ్‌గా దీపికనే నటిస్తోంది. కబీర్ ఖాన్‌ది తెలివైన ఎంపిక."
-రణ్వీర్ సింగ్
ఇప్పటివరకు ఈ జంట మూడు చిత్రాల్లో నటించింది. చివరిసారిగా గతేడాది విడుదలైన పద్మావత్‌లో వెండితెరపై మెరిశారు. ప్రస్తుతం ఈ చిత్రం స్కాట్లాండ్లోని గ్లాస్గోలో తెరకెక్కుతోంది.
1983 ప్రపంచ కప్ ఫైనల్లో కపిల్ సారథ్యంలో వెస్టిండీస్‌పై అద్భుత విజయాన్ని సాధించింది భారత జట్టు. మొదటిసారిగా భారత్‌కు ప్రపంచకప్‌ను అందించింది. ఈ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2020 ఏప్రిల్ 10న విడుదల కాబోతుంది. ఈ చిత్రం రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మధు మంతెన, విష్ణు ఇందూరి, కబీర్ నిర్మిస్తున్నారు.