ETV Bharat / sitara

షారుక్​ సినిమాలో నటిస్తున్నా: దీపిక

author img

By

Published : Jan 20, 2021, 8:21 AM IST

షారుక్​ ఖాన్​ కొత్త చిత్రం 'పఠాన్​'లో దీపికా పదుకొణె హీరోయిన్​గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Deepika Padukone confirms that Shah Rukh Khan will be returning to the big screen with Pathan
షారుక్​ సినిమాలో నటిస్తున్నా: దీపిక

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌, దీపికా పదుకొణె జంటకు హిట్‌పెయిర్‌గా హిందీ చిత్రపరిశ్రమలో పేరుంది. 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' వంటి హిట్‌ చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. మరోసారి వీరిద్దరు సిల్వర్‌స్క్రీన్‌పై ఆడిపాడడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని దీపికనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

"ముందుగా నేను శకున్‌ బాత్రా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రాన్ని పూర్తిచేయాలి. ఆ తర్వాత షారుక్‌తో 'పఠాన్‌' చిత్రంలో నటిస్తున్నాను. అలాగే ప్రభాస్‌కు జంటగా నాగఅశ్విన్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయాలి."

- దీపికా పదుకొణె, కథానాయిక

మరోవైపు 'జీరో' సినిమా తర్వాత షారుక్‌ ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో షారుక్‌ తర్వాత నటించే చిత్రంపై ఊహగానాలు మొదలయ్యాయి. షారుక్​ నటిస్తున్న కొత్త చిత్రం 'పఠాన్​'పై వస్తున్న ఊహాగానాలకు.. దీపిక వివరణతో వాటికి తెరపడింది.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్'​ టీజర్​ విడుదలలో చిన్న మార్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.