Deepika Hyderabad: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె. ఈ విషయాన్ని తెలిపింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.
ఈ సినిమాలో డార్లింగ్, దీపికతో పాటు అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం క్రితం ప్రారంభించి బిగ్‌బీపై(prabhas and amitabh bachchan movie) కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఆ తర్వాత ప్రీ పొడక్షన్ పనులనే కొనసాగించారు. ఆ తర్వాత ఇప్పుడు తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు. డిసెంబరు 7న ప్రభాస్ సెట్లో అడుగుపెడతారని తెలిసింది.
దీపిక.. త్వరలోనే '83' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు రణ్వీర్ సింగ్‌తో 'సర్కస్', షారుక్‌తో 'పఠాన్' చిత్రాల్లోనూ నటిస్తోంది. జనవరి 14న 'రాధేశ్యామ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్.. 'సలార్', 'ఆదిపురుష్', 'స్పిరిట్' చిత్రాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రభాస్-నాగ్అశ్విన్ సినిమా.. సంగీత దర్శకుడు మారాడా?