మహిళల సమస్యలు, హక్కులు, సమానత్వంపై ఎప్పడూ మాట్లాడే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే... స్త్రీలు ఎదుర్కొనే మరో సమస్యపై గళమెత్తింది. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత పిల్లలకు జన్మనివ్వడం.. ఇలా ప్రతి విషయంలోనూ మహిళలపై ఒత్తిడి చేయటం సరైంది కాదంటూ వ్యాఖ్యానించింది.
గతేడాది నవంబరు 15న దీపిక, రణ్వీర్ సింగ్‌ల వివాహమైంది. పెళ్లి తర్వాత పిల్లలు ఎప్పుడంటూ దీపికకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై దీపికా స్పందించింది.
'పెళ్లైన వెంటనే పిల్లలు ఎప్పుడంటూ మహిళలను ఇబ్బంది పెడుతుంటారు. ప్రతి స్త్రీ ఈ సమస్య ఎదుర్కొంటోంది. అయినా ఇలా భార్యాభర్తలపై ఒత్తిడి తేవడం మంచిది కాదు. ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో మహిళలను ఇబ్బందిపెట్టడం మానేస్తారో అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది' అంటూ దీపిక ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చింది.
దీపికా ప్రస్తుతం ఛపాక్ అనే చిత్రంలో నటిస్తోంది. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరవాత దీపిక హాలీవుడ్ హీరో విన్ డీజిల్‌తో కలిసి 'ట్రిపుల్ ఎక్స్ 4' చిత్రంలో నటించనుంది.