ETV Bharat / sitara

హిందీలో రికార్డు సృష్టించిన 'డియర్‌ కామ్రేడ్‌'

author img

By

Published : Apr 8, 2020, 8:03 PM IST

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ హిందీలో డబ్ చేసి యూట్యూబ్​లో అప్​లోడ్ చేసింది. ప్రస్తుతం రికార్డు వీక్షణలతో దూసుకెళ్తోంది.

కామ్రేడ్
కామ్రేడ్

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా దర్శకుడు భరత్‌ కమ్మ తెరకెక్కించిన చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌'. తెలుగులో అనుకున్న స్థాయిలో విజయం అందులేకపోయింది. కాలేజీ, క్రికెట్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమాను ఓ ప్రముఖ సంస్థ హిందీలో డబ్‌ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. 100 మిలియన్ల వీక్షణలు, 1.3 మిలియన్‌ లైక్స్‌తో రికార్డు సృష్టించింది.

హిందీలో
డియర్ కామ్రేడ్

తెలుగు సినిమా డబ్‌ అయి ఇంతటి ప్రేక్షకాదరణ పొందడం విశేషం. విజయ్, రష్మిక నటన చాలా బాగుందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు వీక్షకులు. ఏది ఏమైనా బాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా నచ్చేశాడీ 'డియర్‌ కామ్రేడ్‌'. ఇదిలా ఉంటే పూరి దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రం పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీలోనూ విడుదల కాబోతుంది. ఇలా ఈసారి బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ప్రత్యక్షంగా పలకరించనున్నాడు దేవరకొండ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.