ETV Bharat / sitara

దబాంగ్-3లో సల్మాన్​ ఖాన్​ తెలుగు పలుకులు!

author img

By

Published : Aug 21, 2019, 3:47 PM IST

Updated : Sep 27, 2019, 7:05 PM IST

బాలీవుడ్ సూపర్​స్టార్​ సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్-3' దక్షిణాది భాషల్లో అలరించనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. ఈ ఏడాది డిసెంబర్​ 20న క్రిస్మస్​ కానుకగా ప్రేక్షకుల ముందకు రానుంది.

బాలీవుడ్ సూపర్​స్టార్​ సల్మాన్ ఖాన్

'దబాంగ్' సిరీస్​లో చుల్​బుల్​ పాండేగా మెప్పించిన సల్మాన్​... మరోసారి 'దబాంగ్-3' సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్​ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు భాయ్​ ట్వీట్​ చేశాడు.

"చుల్​బుల్ పాండే డిసెంబర్ 20​న హిందీ, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో మీ ముందుకురానున్నాడు".
-సల్మాన్​ఖాన్​, బాలీవుడ్​ హీరో

'దబాంగ్ 3' లో కండలవీరుడికి జోడీగా సోనాక్షి సిన్హా కనిపించనుంది. కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్​ నటుడు మహేశ్​ ముంజ్రేకర్​ కూతురు సాయి ముంజ్రేకర్​ ఈ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తోంది. ప్రభుదేవా దర్శకుడు. దబాంగ్​ సిరీస్​లో వచ్చిన మూడు చిత్రాలకు ​నిర్మాతగా వ్యవహరించాడు సల్మాన్​ సోదరుడు అర్బాజ్ ఖాన్.

ఇదీ చూడండి: 'ద మ్యాట్రిక్స్'​కు మరో సీక్వెల్... అదిరే ట్విస్ట్​తో పార్ట్​-4!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.