రెండు పాటలు మినహా టాకీ భాగం పూర్తయిందంటూ 'ఆర్ఆర్ఆర్'(RRR Movie) చిత్రబృందం మంగళవారం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో బుల్లెట్‌పై ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ramcharan) రయ్రయ్ అంటూ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు.
దీనిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ పోస్ట్రను వినియోగించుకున్నారు. దీన్ని ఎడిట్ చేసి తారక్, చెర్రీకి హెల్మెట్ తగిలించారు. 'ఇప్పుడు పర్ఫెక్ట్. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ఉండండి' అంటూ వ్యాఖ్య జోడించారు. ఇది కాస్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది.
మళ్లీ దీనికి రిప్లై ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం.. 'ఇంకా పర్ఫెక్ట్గా లేదు. నెంబర్ ప్లేట్ కనిపించడం లేదంటూ' హాస్యస్పదంగా రీట్వీట్ చేసింది.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొంత కాలం నుంచి ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తమదైన శైలిలో సోషల్‌మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. వీలు దొరికినప్పుడల్లా ఇలాంటివి షేర్ చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘన వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కలిగిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌పై కేన్ మామతో వార్నర్