నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఆయనకు ట్విట్టర్లో చెప్పడంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
కొన్నేళ్ల క్రితం క్యాన్సర్‌ను జయించిన యువరాజ్.. ఆ వ్యాధిగ్రస్థులకు అవగాహన కల్పించేందుకు యూవీకెన్(YouWeCan) ఫౌండేషన్ స్థాపించాడు. ఆ సంస్థ బాలకృష్ణకు చెందిన బసవతారకం క్యాన్సర్ ట్రస్టుతో కలిసి గతంలో పనిచేసింది.
ఇవీ చదవండి: