ETV Bharat / sitara

టాలీవుడ్ మల్టీస్టారర్​లు.. క్రేజీ కాంబోలు! - టాలీవుడ్ మల్టీస్టారర్​లు.. క్రేజీ కాంబోలు

మల్టీస్టారర్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కళ్లు రెండింతలు చేసుకుని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఒకే టికెట్​పై రెండు చిత్రాల్ని ఆస్వాదించినట్లుగా డబుల్ మజాని అందించేవి మల్టీస్టారర్​లే కదా. టాలీవుడ్​లోనూ ఇలాంటి చిత్రాలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. ప్రస్తుతం ఈ ఏడాదిలోనూ వీటి సందడి ఉండబోతుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్న మల్టీస్టారర్​ చిత్రాలేంటో చూద్దాం.

Crazy Multistarers in Tollywood
టాలీవుడ్ మల్టీస్టారర్​లు
author img

By

Published : Feb 23, 2021, 9:16 AM IST

వెండితెరపై ఎన్ని రకాల సినిమాల్ని ఆస్వాదించినా.. ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చూస్తే దొరికే కిక్కే వేరు. ఎందుకంటే ఒక్క టికెట్‌పై రెండు చిత్రాల్ని ఆస్వాదించినట్లుగా డబుల్‌ డోస్‌ మజాని రుచి చూపించేవి మల్టీస్టారర్‌ చిత్రాలే కదా. అందుకే బాక్సాఫీస్‌ ముందుకు ఓ మల్టీస్టారర్‌ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కళ్లు రెండింతలు చేసుకుని ఆసక్తిగా చూస్తుంటారు. ఇప్పుడిలాంటి డబుల్‌ ధమాకా వినోదాల్ని రుచి చూపించేందుకు తయారవుతున్నారు మన హీరోలు. తెలుగు సినీ పరిశ్రమలో రానున్న రోజుల్లో ప్రేక్షకులను కనువిందు చేయనున్న మల్టీస్టారర్‌ చిత్రాలేంటో చూసేద్దాం.

మల్టీస్టారర్‌ సినిమాలు తెలుగు సినీప్రియులకు కొత్తేం కాదు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ రోజుల నుంచి వెండితెరపై సందడి చేస్తున్న ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ఫార్ములాల్లో ఇదీ ఒకటి. ఆ మధ్య కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌ చిత్రాల సందడి పెద్దగా కనిపించనప్పటికీ.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత నుంచి వాటి జోరు మళ్లీ పెరిగింది. అగ్ర కథానాయకులు వెంకటేష్‌-మహేష్‌బాబులు కలిసి నటించిన ఈ చిత్రం.. అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. దీంతో అప్పటి నుంచి మిగతా హీరోలు మల్టీస్టారర్‌ల వైపు చూడటం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత వచ్చిన 'గోపాల గోపాల', 'బాహుబలి', 'ఎఫ్‌ 2', 'దేవదాస్‌', 'వెంకీమామ' తదితర చిత్ర విజయాలూ మల్టీస్టారర్ల విషయంలో దర్శక నిర్మాతలకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇప్పుడీ స్ఫూర్తితోనే తెలుగు తెరపై మరికొన్ని కొత్త మల్టీస్టారర్లు తెరకెక్కుతున్నాయి.

అందరి కళ్లు ఆర్ఆర్ఆర్​పైనే

ప్రస్తుతం తెలుగులో సెట్స్‌పై ముస్తాబవుతోన్న క్రేజీ మల్టీస్టార్లలో జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నది దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'పైనే. 'బాహుబలి' లాంటి హిట్‌ చిత్రాల తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న సినిమా కావడం.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి ఇద్దరు స్టార్‌ కథానాయకులు తొలిసారి తెర పంచుకుంటుండటం వల్ల దీనిపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్వాతంత్య్ర వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ జీవితాల స్ఫూర్తితో రాసుకున్న ఓ ఫిక్షనల్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు జక్కన్న. ఇప్పటికే 70శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెగా జోడీ

లాక్​డౌన్ అనంతరం ఇటీవల మొదలైన 'ఆచార్య' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా, ఆయన తనయుడు రామ్​చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మొదట ఇది అతిథి పాత్ర అని అనుకున్నా.. చరణ్ పూర్తి స్థాయి పాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు దర్శకుడు శివ కొరటాల. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్-రానా.. ఓ క్రేజీ కాంబో

టాలీవుడ్ మల్టీస్టారర్​ల జాబితాలో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది 'అయ్యప్పన్‌ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించబోతుంది. ఈ చిత్రంలో హీరోలుగా పవన్ కల్యాణ్-రానా నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పవన్-రానా కాంబో తెరపై ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్​లో ఈ చిత్రం విడుదల కానుంది.

మహా సముద్రం

'ఆర్‌ఎక్స్‌ 100'తో విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి.. 'మహా సముద్రం' పేరుతో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శర్వానంద్‌, సిద్ధార్థ్ కథానాయకులుగా కనిపించనున్నారు. ఓ ఇంటెన్స్ లవ్​స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్టర్లు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Crazy Multistarers in Tollywood
మహాసముద్రం

ట్రిపుల్ ఫన్

వెంకటేష్‌ - వరుణ్‌ తేజ్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్‌ 2. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 'ఎఫ్‌3' పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రంలో మూడో హీరోగా సునీల్ సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Crazy Multistarers in Tollywood
ఎఫ్ 3

బాలయ్యతో శౌర్య

బోయపాటి శ్రీనుతో మూడోసారి కలిసి పనిచేస్తున్న నందమూరి బాలకృష్ణ.. తర్వాతి ఓ యువ దర్శకుడి తీస్తున్న సినిమాలో నటిస్తారు. ఇందులో యంగ్ హీరో నాగశౌర్య కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ త్వరలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇవీ చూడండి: చూపు తిప్పుకోలేని అందం.. కాజల్​ సొంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.