టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'అర్జున్‌రెడ్డి' మళ్లీ క్రేజ్ తెచ్చుకుంటోంది. దీనికి కారణం ఇటీవలే ఈ సినిమాకు చెందిన బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్' విడుదల కావడమే. కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతుంటే.. ‘అర్జున్‌రెడ్డి’ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది.
విడుదలైన రెండేళ్ల తర్వాత ఏం రికార్డు అందుకుందా అని ఆశ్చర్యపోతున్నారా? దేశవ్యాప్తంగా ‘కబీర్ సింగ్’కు వస్తున్న ఆదరణ, విమర్శల వల్ల ఆ చిత్ర ఒరిజినల్ వెర్షన్ ‘అర్జున్‌రెడ్డి’పై ఉత్తరాది సినీ ప్రియుల కన్ను పడింది. ఈ కారణంగా గత కొద్దిరోజలుగా ‘అర్జున్‌రెడ్డి’ ట్రైలర్‌ను వీక్షించే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మొత్తంగా 4 కోట్ల మంది ఇప్పటివరకు చూశారు.
అంతేకాకుండా నాన్ బాహుబలి ట్రైలర్లలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న చిత్రంగా ఉన్న ‘వినయ విధేయ రామ’ రికార్డును ‘అర్జున్ రెడ్డి’ చెరిపేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: నాని 'గ్యాంగ్‌లీడర్'కు మ్యూజిక్ స్టార్ట్