ETV Bharat / sitara

23 వేల మందికి ఆర్థిక సాయం చేసిన సల్మాన్​ - corona news

కరోనా లాక్​డౌన్​ కారణంగా తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సినీకార్మికులను ఆదుకోవడానికి బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్​ ముందుకొచ్చాడు. దాదాపు 23 వేల మందికి 3 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించాడు. హీరో వరుణ్​ ధావన్​.. పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేయనున్నట్టు తాజాగా ప్రకటించాడు.

COVID-19: Salman Khan begins process of transferring funds to daily wage workers
సినీకార్మికులకు రూ.3 వేల సాయం చేసిన సల్మాన్​
author img

By

Published : Apr 8, 2020, 1:44 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవటానికి బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ఖాన్​ ముందుకొచ్చాడు. 25 వేల మంది కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని ఇటీవలే తెలిపాడు. అందులో భాగంగా 23 వేల మంది పేద కార్మికుల వివరాలను మంగళవారం సల్మాన్​కు అందించినట్లు భారత పశ్చిమ సినీకార్మికలు సమాఖ్య(ఎఫ్​డబ్ల్యూఐసీఈ) అధ్యక్షుడు బీఎన్​ తివారి తెలిపారు. ప్రతి ఒక్క కార్మికుడికి మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్టు చెప్పాడు. ఒకవేళ దేశంలో ఇదే పరిస్థితే కొనసాగితే భవిష్యత్​లో మరోసారి వారికి సల్మాన్​ సహకారం అందిస్తాడని సమాచారం.

రేషన్​ కూపన్లు అందిస్తానన్న అమితాబ్​

యశ్​రాజ్​ నిర్మాణ సంస్థ 3వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిందని తివారి తెలిపారు. సినీపరిశ్రమ నుంచి ఇప్పటివరకు మూడు కోట్ల విరాళాలు అందాయని.. ఏప్రిల్​ 15 తర్వాత దశల వారిగా అవసరమైన వారికి డబ్బును పంచుతామని చెప్పారు. అమితాబ్ బచ్చన్​ లక్ష మందికి రేషన్​ కూపన్లు అందజేయనున్నట్టు వెల్లడించారు. బాలీవుడ్​లోనే కాకుండా హైదరాబాద్​, చెన్నై, కోల్​కతా, కర్ణాటకకు చెందిన సినీకార్మికులకూ ఈ కూపన్లు అందిస్తామన్నారు.

COVID-19: Salman Khan begins process of transferring funds to daily wage workers
వరుణ్​ ధావన్​

ఉచిత ఆహార పంపిణీ!

కరోనాపై పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని బాలీవుడ్​ నటుడు వరుణ్ ​ధావన్​ ప్రకటించాడు. ఇటీవలే రూ.55 లక్షలను విరాళంగా ఇచ్చిన ఈ నటుడు తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు.

ఇదీ చూడండి.. బన్నీ-సుకుమార్ సినిమా టైటిల్​ 'పుష్ప'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.