ETV Bharat / sitara

సుశాంత్​ కేసులో కంగనా రనౌత్​కు సమన్లు! - kangana to record statement in sushant case

బాలీవుడ్ హీరో సుశాంత్​ కేసు విచారణలో భాగంగా నటి​ కంగనా రనౌత్​కు పోలీసులు సమన్లు జారీ చేయనున్నారు. ​ఈ విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ, తదితరులను పోలీసులు విచారించారు.

sushanth
సుశాంత్​
author img

By

Published : Jul 23, 2020, 5:53 PM IST

బాలీవుడ్​ యంగ్​హీరో సుశాంత్​ సింగ్​ ​ఆత్మహత్య కేసులో సినీ ప్రముఖుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా హీరోయిన్​ కంగనా రనౌత్​ విచారణకు హాజరు కావాల్సిందిగా ముంబయి పోలీసులు సమన్లు జారీ చేయనున్నారు. అందుకు సంబంధించిన దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. విచారణ విషయంలో పోలీసులు సరైన స్పష్టత ఇవ్వట్లేదని కంగనా సోదరి రంగోలి కొన్ని స్క్రీన్​ షాట్లను బయటపెట్టిన అనంతరం.. అధికారులు ఈ చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.

sushanth
సుశాంత్​

సుశాంత్​ మరణించినప్పటి నుంచి అతడి మద్దతుగా నిలుస్తోంది కంగనా. చిత్రసీమలో బంధుప్రీతి వల్లే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీనికి సంబంధించిన పలు దృశ్య సందేశాలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్​ చేసింది.

ఇప్పటికే సుశాంత్​ కేసు విచారణలో భాగంగా యశ్​రాజ్​ ఫిల్మింస్​ అధినేత ఆదిత్య చోప్రా, దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ సహా 39 మంది వ్యక్తుల వాంగ్ములాలను సేకరించారు పోలీసులు.

ఇది చూడండి : సుశాంత్​ కేసులో పోలీస్ స్టేషన్​కు ఆదిత్యా చోప్రా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.