బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ - దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో మరో చిత్రం రానుంది. 'సర్కస్' అనే కామెడీ కథాంశంతో ఓ సినిమా రూపొందించనున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెల్లడించింది చిత్రబృందం. గతంలో వీరిద్దరూ కలిసి పనిచేసిన 'సింబా' విజయవంతమవ్వడం వల్ల ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
-
#RohitShetty & #BhushanKumar collaborate for #Cirkus.#RohitShetty's take on Comedy of Errors, starring @RanveerOfficial, @hegdepooja, @Asli_Jacqueline & @varunsharma90. #Cirkus starts next month in #Mumbai... Winter 2021 release.@TSeries @RelianceEnt @Shibasishsarkar pic.twitter.com/vbD2lFsFzf
— T-Series (@TSeries) October 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#RohitShetty & #BhushanKumar collaborate for #Cirkus.#RohitShetty's take on Comedy of Errors, starring @RanveerOfficial, @hegdepooja, @Asli_Jacqueline & @varunsharma90. #Cirkus starts next month in #Mumbai... Winter 2021 release.@TSeries @RelianceEnt @Shibasishsarkar pic.twitter.com/vbD2lFsFzf
— T-Series (@TSeries) October 19, 2020#RohitShetty & #BhushanKumar collaborate for #Cirkus.#RohitShetty's take on Comedy of Errors, starring @RanveerOfficial, @hegdepooja, @Asli_Jacqueline & @varunsharma90. #Cirkus starts next month in #Mumbai... Winter 2021 release.@TSeries @RelianceEnt @Shibasishsarkar pic.twitter.com/vbD2lFsFzf
— T-Series (@TSeries) October 19, 2020
ఇంగ్లీష్ రచయిత షేక్స్పియర్ రాసిన క్లాసికల్ కామెడీ ఆధారంగా 'సర్కస్' రూపొందనుంది. కవలలుగా పుట్టిన ఇద్దరు పిల్లలు అనుకోకుండా ఎలా విడిపోయారనే దాని చుట్టూ జరిగే కథతో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటించనున్నారు.
నవంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ముంబయి, ఊటీ, గోవాలో షూటింగ్ జరపనున్నారు. 2021 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.