అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తుమకూరు కోర్టులో కేసు దాఖలైంది. కర్ణాటకు చెందిన న్యాయవాది రమేశ్ నాయక్ ఈ కేసు పెట్టారు. రైతులను నటి అవమానించిందని, ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా అనేకమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హరియాణాలోని అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారీ తీశాయి. ఈ క్రమంలోనే కంగన.. రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్ చేయడం కలకలం రేపింది.
ఇదీ చూడండి విచారణలో ఐదుగంటల పాటు దీపికా పదుకొణె