ETV Bharat / sitara

ఆ కమెడియన్​కు స్టార్​ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్​! - Star Comedian Rajababu remuneration

ఆ కమెడియన్​ సినిమాల్లో ఉంటే ఆ మూవీ సగం హిట్టయినట్టే! ఆయన తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు కితకితలే. హాస్యనటుడిగా హీరోను మించిన పాపులారిటీ, డబ్బును సంపాదించారాయన. ఇంతకీ ఆయన ఎవరంటే?

Star Comedian Rajababu Death Anniversary
ఆ కమెడియన్​కు స్టార్​ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్​
author img

By

Published : Feb 14, 2022, 3:49 PM IST

Comedian Rajababu Death Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుల పేర్లు చెప్పాల్సి వస్తే రాజబాబు పేరు తప్పకుండా ఉంటుంది. ‘హాస్యనట చక్రవర్తి’గా ఎన్నో వెలకట్టలేని పాత్రలు పోషించారాయన. కథానాయకుడు ఎవరైనా సరే! ఆయన ఉంటే చాలు. సినిమా సగం హిట్టయినట్టే అన్నది ఆనాటి దర్శక-నిర్మాతల నమ్మకం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాజబాబు ఒకానొక దశలో హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేవారట.

ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలు. రాజబాబు పారితోషికం 20వేల రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకూ 35వేల రూపాయలు కావాల్సిందేనని పట్టుపట్టారు రాజబాబు. 'ఎన్టీఆర్ హీరో.. మీరు కమెడియన్’ అని నిర్మాత అంటే, ‘అయితే హీరోనే కమెడియన్‌గా చూపించి సినిమాను విడుదల చేయండి' అని సమాధానం ఇచ్చారట. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే బుర్రకథ, హరికథలతో నవ్వులు పంచేవారట. స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాలు లభించక ట్యూషన్లు చెప్పుకొంటూ బతికారు.

జగపతి వారి 'అంతస్తులు' సినిమాలో నటించినందుకు రాజబాబు అందుకున్న పారితోషికం 1300 రూపాయలు. రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం అదే. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయిదు రూపాయల కోసం గంటల తరబడి టి.నగర్‌లో నిలబడిన చోటు ముందు లక్ష రూపాయల ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకునేవారట. తనలా కష్టాలు పడుతున్న చాలామందిని అప్పట్లో ఆదుకున్నారు.

"తెలుగులో ఎవరైనా సినిమా తీయాలంటే, స్క్రిప్ట్‌ ఉండేది కాదు.. డైరెక్టర్‌ ఎవరో తెలియదు. కానీ, రాజబాబు, రమాప్రభ అని రాసుకుని మద్రాసుకు వచ్చేవారు. ఆ తర్వాత కథ, సినిమా మొదలయ్యేవి" అని రాజబాబుతో తన కాంబినేషన్‌ గురించి రమాప్రభ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే వారి కాంబినేషన్‌ ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గంటల చొప్పున నటించిన నటుడాయన. ఒక గంట ఎన్టీఆర్‌తో నటిస్తే, మరో గంట శోభన్‌బాబు, ఇతరుల చిత్రాల్లో నటించిన రికార్డు రాజబాబు సొంతం. డబ్బుకు, పరపతికి కొదవ లేదు. కుటుంబంతో గడపలేనంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేనంత తీరికలేకుండా ఉండేవారు. ఒకప్పుడు మద్రాస్‌లో కేవలం మంచినీళ్లు తాగి రోజులు వెళ్లదీసిన రాజబాబు.. కమెడియన్‌గా హీరోను మించిన పాపులారిటీ, డబ్బు సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు లక్షల్లో పారితోషికం తీసుకున్నారు. ఫిబ్రవరి 14 రాజబాబు వర్థంతి.

ఇదీ చూడండి: Valentine's day 2022: సినిమా కలిపింది వాళ్లిద్దరినీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.