బాలీవుడ్ హాస్యనటి భారతీ సింగ్‌తో పాటు భర్త హర్ష్ లింబాచియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆదివారం అరెస్టు చేసింది. శనివారం ఉదయం భారతీసింగ్ కార్యాలయం, నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ.. 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంది.
అనంతరం భారతీసింగ్, అమె భర్త హర్ష్ లింబాచియాను ముంబయిలోని కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. వారిద్దరూ గంజాయి తీసుకుంటున్నట్లు అంగీకరించారని.. ఈ నేపథ్యంలో భారతీ సింగ్‌తో పాటు తన భర్తను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరికి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌లో చెలరేగిన మాదకద్రవ్యాల వినియోగం కేసు కలకలం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అగ్ర నటీనటులను ఎన్సీబీ విచారించింది.