*మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi).. ఆది పినిశెట్టి 'క్లాప్' టీజర్‌ను(Clap teaser) రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబరు 6న సాయంత్రం 5:04 గంటలకు అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆది.. రన్నర్‌గా కనిపించనున్నారు. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. మాస్ట్రో ఇళయరాజా(ilayaraja) సంగీతమందిస్తున్నారు.
*పూరీ జగన్నాథ్.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన 'రొమాంటిక్' సినిమా(Romantic movies) సెన్సార్ పూర్తయింది. యూబైఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. త్వరలో థియేటర్లలోకి చిత్రాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. కేతిక శర్మ(ketika sharma age) హీరోయిన్గా నటించగా, అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు.
*విశ్వక్సేన్(vishwak sen) కొత్త సినిమాలో క్లాస్‌గా దర్శనమివ్వనున్నారు. 'అశోకవనంలో అర్జున కల్యాణం' టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్ర లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో విశ్వక్.. పెళ్లి కోసం తాపత్రయపడే వడ్డీ వ్యాపారి పాత్రలో కనిపించనున్నారు. పూర్తివివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*క్రికెటర్ హర్భజన్ సింగ్ 'ఫ్రెండ్షిప్'(harbhajan singh friendship movie) రిలీజ్ డేట్ ఖరారైంది. సెప్టెంబరు 17న థియేటర్లలోకి తీసుకురానున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధు హీరోగా నటించిన 'DJ టిల్లు' టీజర్‌ను(dj tillu teasers) ఆదివారం సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయన్నారు. విమల్ కృష్ణ ఈ చిత్రానికి డైరెక్టర్.
ఇవీ చదవండి: