*మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi age).. 'క్లాప్' టీజర్‌ను(clap movie) విడుదల చేశారు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా.. స్పోర్ట్స్ కథతో తెరకెక్కించారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన కథానాయకుడు.. కృత్రిమ కాలితో తన ఆశయాన్ని ఎల నెరవేర్చుకున్నాడు అనేదే ఈ చిత్ర స్టోరీ. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. ఇళయరాజా(ilayaraja) సంగీతమందించారు. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*తడమ్ తెలుగు రీమేక్ 'రెడ్'. హిందీలోనూ(thadam hindi remake) దీనిని రీమేక్ చేస్తున్నారు. ఆదిత్యరాయ్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా మృణాల ఠాకుర్ ఎంపికైంది. వర్ధన్ కేట్కర్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
*టొవినో థామస్ నటించిన సూపర్‌హీరో సినిమా 'మిన్నల్ మురళి'(minnal murali). బాసిల్ జోసెఫ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సూపర్‌హీరో సందడి చేయనున్నాడు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
*క్రికెటర్ హర్భజన్ సింగ్(harbhajan singh) నటించిన తొలి సినిమా ఫ్రెండ్షిప్(friendship movie). తమిళంలో తీసిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. కాలేజ్ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో థియేటర్లలోకి తీసుకురానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- Pawan Kalyan: పవన్ మరో సినిమా షూటింగ్‌కు రెడీ
- Liger Promise: మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
- Sohel New Movie: 'మిస్టర్ ప్రెగ్నెంట్'గా బిగ్‌బాస్ సొహెల్
- Cinema news: 'భీమ్లానాయక్' రికార్డు.. 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' ట్రైలర్