తెలంగాణలో సినిమా థియేటర్ల తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో సినిమాను ప్రదర్శించాలని పేర్కొంది. హాల్ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం నిబంధనలు విధిగా పాటించాలని తెలిపింది. థియేటర్లో ఏసీ 24 నుంచి 30 డిగ్రీలు ఉండేలా చూడాలని ఆదేశించింది.
అంతకుముందు సోమవారం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇదే విషయాన్ని చెప్పాడు. థియేటర్ల తెరుచుకోవడంపై నిర్ణయాధికారం సినీ పరిశ్రమదేనని అన్నారు.
మేనిఫెస్టోలోని అంశాలు
- రాష్ట్రంలోని సినిమా థియేటర్లకు హెచ్టీ, ఎల్టీ కేటగిరీ కనెక్షన్లకు విద్యుత్ కనీస ఛార్జీలు రద్దు
- రూ.10 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ సహాయం
- అన్ని థియేటర్లలోనూ షోలు పెంచుకునేందుకు అనుమతి మంజూరు
- మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ తరహాలో టిక్కెట్ల ధరలు సవరించుకునే వెసులుబాటు
ముఖ్యమంత్రి చెప్పారు కానీ కొవిడ్ కేసులు రెండో దశ మొదలైన నేపథ్యంలో థియేటర్లు తెరుచుకున్నా సరే జనాలు ఇంతకుముందులా వస్తారా? అనేది ఇప్పుడు అందరికి వస్తున్న ప్రశ్న.