ETV Bharat / sitara

తెలుగు సినిమాల షూటింగ్​లపై అప్పట్లోనే ఆంక్షలు! - సినిమా షూటింగ్​లకు లాక్​డౌన్​ నిబంధనలు

లాక్​డౌన్​తో నిలిచిపోయిన సినిమాలు, టీవీ షోల చిత్రీకరణలకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. కరోనా నియంత్రణలో భాగంగా నిబంధనలు పక్కాగా పాటించాల్సిందేనని ఆదేశించాయి. ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఇదేమి తొలిసారి కాదు. గతంలోనే ఇదే తరహాలో షూటింగ్​లు చేశారు. ఇంతకీ ఎప్పుడు అలా జరిగింది?

cinema shootings restarted in india
తెలుగు సినిమాల షూటింగ్​లపై అప్పట్లో ఆంక్షలు ఇలా!
author img

By

Published : Jun 18, 2020, 7:45 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశం మొత్తం లాక్​డౌన్ విధించారు. ఆ సమయంలో రెండున్నర నెలల పాటు సినిమాలు, టెలివిజన్‌ కార్యక్రమాల షూటింగులు నిలిచిపోగా.. ఇటీవలే వాటిని తిరిగి మొదలుపెట్టేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. జూన్​ 15 నుంచి తెలంగాణలో చిత్రీకరణలు ప్రారంభమవగా.. జులై 15 నుంచి ఆంధ్రాలోనూ షూటింగ్​లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ.. పరిమిత సిబ్బంది, శానిటైజేషన్​, మాస్క్ తప్పనిసరి వంటి జాగ్రత్తలతోనే షూటింగ్​లు జరపాలని ఆయా ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే చిత్రీకరణలపై కొద్దిపాటి పరిమితులు విధించడం మనకు కొత్తేమి కాదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే ఇదే తరహా నిబంధనలు పాటించినట్లు తెలుస్తోంది.

ఆ కారణంగానే?

1942-43 కాలంలో రెండో ప్రపంచ యుద్ధం తారాస్థాయిలో ఉంది. సినిమాకు కావాల్సిన ఫిల్మ్​ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అయితే విదేశీ దిగుమతులపై బ్రిటీష్​ ప్రభుత్వం ఆంక్షలు విధించిన కారణంగా, కొడాక్​ ముడి ఫిల్మ్​ కొరతతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. సినిమా షూటింగ్​లు నిలిచిపోయాయి. దీనిపై అధికారులకు విన్నవించుకోగా.. స్పందించిన ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది.

కొత్తగా సినిమాలు తీయాలనుకునే కంపెనీలకు అనుమతులు నిరాకరించారు. అంతకు ముందు ప్రారంభమై, చిత్రీకరణ మధ్యలో ఉన్న వాటికి మాత్రమే పర్మిట్​ ఇచ్చారు. అందులో మరో నిబంధననూ విధించారు. చిత్రం కోసం ఉపయోగించే రీలు పొడవు 11 వేల అడుగులకు మించకూడదని అన్నారు. దానిని పాటిస్తూనే ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి.. 'సర్వసీమ' తీశారు. 11 వేల అడుగుల రీల్​నే దీనికోసం వినియోగించగా.. సినిమా మాత్రం హిట్​గా నిలిచింది. ఆంధ్రాలోనే కాకుండా తమిళనాడు, బెంగళూరులోని పలు కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమైంది.

అలా తొలిసారి ఆంక్షల మధ్య టాలీవుడ్​లో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఇదే తరహాలో స్టార్​ హీరోల చిత్రాలు తీయబోతున్నారు. చిత్రీకరణలకు అనుమతిచ్చిన ప్రభుత్వాలు... కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లు తెరిచేందుకు అంగీకరించట్లేదు.

ఇదీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీలో చిత్రీకరణలు పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.