ETV Bharat / sitara

టాలీవుడ్​లో 'టాప్ గేర్' పడాల్సిందే!

తెలుగు చిత్రపరిశ్రమలో లాక్​డౌన్ తర్వాత షూటింగ్స్ ప్రారంభమైనా సరే అగ్ర కథానాయకులు కొందరు సెట్స్​లో అడుగుపెట్టలేదు. వారు వస్తే టాలీవుడ్ టాప్ గేర్​లో వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

cinema shooting start but tollywood top heros not attend
టాలీవుడ్​లో 'టాప్ గేర్' పడాల్సిందే!
author img

By

Published : Oct 12, 2020, 7:34 AM IST

Updated : Oct 12, 2020, 7:55 AM IST

అగ్రతారలంతా సెట్లో గడుపుతున్నారు అంటే ఆ పరిశ్రమ పరుగులు పెడుతున్నట్టే. ఈ లెక్కన తెలుగు చిత్రసీమ ఇంకా గేర్‌ మార్చలేదు. టాప్‌ గేర్‌ పడాలంటే స్టార్‌ హీరోలంతా రంగంలోకి దిగాల్సిందే. కరోనా కల్లోలం తర్వాత సినిమాలు పునః ప్రారంభమై... వాటిలో కొన్ని తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నా, చాలా మంది అగ్ర తారలు ఇప్పటికీ రంగంలోకి దిగలేదు.

అగ్ర తారలు నటించిన సినిమాలు విడుదలయ్యాయంటే ఆ సందడే వేరు. ప్రేక్షకులు థియేటర్ల ముందు వరస కడతారు. బాక్సాఫీసు వసూళ్లతో నిండిపోతుంది. అదీ తారా బలం అంటే. వాళ్లు నటించే సినిమాలు పట్టాలెక్కినా అంతే. చిత్రసీమ ఒక్కసారిగా కళ సంతరించుకుంటుంది. అభిమానులు ఆయా సినిమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. పంపిణీదారులూ అడ్వాన్సులు పట్టుకుని ఆరా తీయడం మొదలు పెడతారు. ఇంత ఆకర్షణ ఉంటుంది కాబట్టే... అందరి దృష్టి వారి సినిమాలపై ఉంటుంది. కరోనాకు ముందు వరకూ మన స్టార్‌ హీరోలు జోరుమీద కనిపించారు. ఎవరికివాళ్లు లక్ష్యాల్ని నిర్దేశించుకుని సెట్‌లో చెమటోడ్చారు. కానీ కరోనా అందరి ప్రణాళికల్ని తారుమారు చేసింది. ఆ కల్లోలం తర్వాత ఇప్పుడిప్పుడే చిత్రీకరణలు మొదలవుతున్నాయి. యువ కథానాయకుల్లో సింహభాగం రంగంలోకి దిగారు. ఎటొచ్చీ సీనియర్ల చిత్రాలే ఇంకా మొదలవట్లేదు.

వచ్చే నెలలోనే...

నాగార్జున 'వైల్డ్‌డాగ్‌' ఇటీవల కొన్నాళ్లు చిత్రీకరణ జరుపుకున్నా, చిరంజీవి 'ఆచార్య', వెంకటేశ్ 'నారప్ప', బాలకృష్ణ - బోయపాటి చిత్రాలు ఇంకా పున ప్రారంభానికి నోచుకోలేదు. 'ఆచార్య' ఇప్పటికే నలభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వెంకటేశ్ 'నారప్ప' సగానికిపైగా పూర్తయింది. వీటి ప్రారంభ విషయంలో ఇంకా స్పష్టత లేదు. వీటితోపాటు, బాలకృష్ణ - బోయపాటి కలయికలో సినిమా వచ్చే నెల్లో మొదలయ్యే అవకాశాలున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ కూడా కొత్త సినిమాల కోసం రంగంలోకి దిగేందుకు సన్నద్ధం అవుతున్నారు. 'సర్కార్‌ వారి పాట' కోసం దర్శకనిర్మాతలు లొకేషన్ల వేటలో ఉన్నారు. అమెరికాలో చిత్రీకరణను ఆరంభిస్తారు. పాటల రికార్డింగ్‌ మొదలైనట్టు సంగీత దర్శకుడు తమన్‌ తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభం విషయంలో ఇంకా స్పష్టత లేదు. అల్లు అర్జున్‌ 'పుష్ప' మాత్రం నవంబరు తొలి వారంలో మొదలుకానుంది.

'వకీల్‌సాబ్‌' మొదలైంది కానీ..

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'వకీల్‌సాబ్‌' చిత్రీకరణ పునః ప్రారంభమైంది. అయితే పవన్‌ ఇంకా కెమెరా ముందుకు వెళ్లలేదు. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న అంజలి, నివేదాథామస్‌పై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి లక్ష్యంగా ముస్తామవుతోంది కాబట్టి పవన్‌ త్వరలోనే మేకప్‌ వేసుకుంటారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్‌, రవితేజ, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, నాని, శర్వానంద్‌ తదితరులు ఇప్పటికే రంగంలోకి దిగారు.

Last Updated : Oct 12, 2020, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.