అధికార లాంఛనాల నడుమ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్(Dilip Kumar Died) అంత్యక్రియలు ముగిశాయి. శాంటాక్రూజ్ ముంబయిలోని జుహు కబ్రాస్థాన్లో ఈ కార్యక్రమం జరిగింది. కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. ఆయన్ను చూసేందుకు వందమందికిపైగా అభిమానులు రాగా, పోలీసులు వారిని అదుపుచేశారు.
గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న దిలీప్ కుమార్ చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ముంబయి హిందూజ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస(Dilip Kumar Died) విడిచారు. ఆయన మరణ వార్తతో బీటౌన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. దిలీప్ మృతిపట్ల పలువురు సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:
Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత