టాలీవుడ్ సీనియర్ నటుడు జనార్ధన్‌రావు కన్నుమూశారు. శుక్రవారం ఉదయం చెన్నై నగరంలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
జనార్ధన్‌రావు స్వస్థలం గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామం. దాదాపు వెయ్యికిపైగా తెలుగు చిత్రాలు, ధారావాహికల్లో నటించారు. 'జానకిరాముడు', 'మజ్ను', 'కొండవీటి సింహం', 'పెదరాయుడు', 'అభిలాష', 'అమ్మోరు', 'గోరింటాకు' వంటి ప్రముఖ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.
జనార్ధన్‌రావు చివరిగా ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో కనిపించారు. 'గోకులంలో సీత', 'తలంబ్రాలు' వంటి సీరియళ్లలో నటించారు. దక్షిణ భారత ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌లో జాయింట్ సెక్రటరీ, కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : రోడ్‌సైడ్ దోశ వేసిన ప్రముఖ హీరోయిన్