మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు
దేవదాస్ కనకాల భౌతికకాయాన్ని రేపు ఉదయం 8గంటలకు మణికొండలోని ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఉదయం 11:30గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
19:22 August 02

19:07 August 02
కేసీఆర్ సంతాపం
దేవదాసు కనకాల మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటని అన్నారు. నటన శిక్షణా సంస్థ ద్వారా ఎందరినో చిత్రపరిశ్రమకు అందించారని కొనియాడారు. కనకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
17:17 August 02
ప్రముఖ నటుడు, దర్శకుడు, నట గురువు దేవదాస్ కనకాల మృతి చెందారు. ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నటుడు రాజీవ్ కనకాల కుమారుడు. ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల ఈయన కోడలు.
స్టార్ హీరోలకు గురువుగా ప్రాముఖ్యత
తొలుత సినిమాల్లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన దేవదాస్ కనకాల.. ఆ తర్వాత నటనలో శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడున్న స్టార్ హీరోలు, నటులు సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, భాను చందర్, అరుణ్ పాండ్యన్, రాంకీ, రఘవరన్ తదితరలు ఈయన దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నవారే.
16:59 August 02
సీనియర్ నటుడు దేవదాసు కనకాల మృతి
సీనియర్ నటుడు దేవదాసు కనకాల మృతి చెందారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దేవదాసు కనకాలకు కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ, కొడలు సుమ. 1945 జులై 30న యానాం శివారు కనకాలపేటలో దేవదాసు జన్మించారు.

కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
క్యారెక్టర్ ఆర్టిస్టు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల మృతి