సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం 'టెనెట్'. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ సినిమా.. జులై 17న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ విషయమై ఓ శుభవార్తను వెల్లడించారు నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్. ఆగస్టు 26న థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్, బ్రిటన్ సహా 70 దేశాల్లోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.అమెరికాలో మాత్రం కాస్త ఆలస్యంగా సెప్టెంబరు 3న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
సైన్స్ ఫిక్షన్ నేపథ్య కథతో తీసిన 'టెనెట్' ట్రైలర్ అంచనాలు పెంచుతోంది. రాబర్ ప్యాటిన్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్, డింపుల్ కపాడియా, కెన్నెత్ బ్రానాగ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">