వైవిధ్యభరిత చిత్రాలకు, విచిత్రమైన గెటప్పులకు చిరునామా హీరో విక్రమ్. అతడు ఎంచుకునే కథలు ఎక్కువ శాతం ఇలానే ఉంటాయి. పాత్ర నచ్చాలే కానీ ఎలాంటి సాహసానికైనా సిద్ధమవుతాడు. అప్పట్లో 'ఐ' సినిమా కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ నటించాడు. ఇప్పడు మరోసారి అలాంటి అడ్వెంచర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్ ఏకంగా 25 గెటప్పుల్లో సందడి చేయనున్నాడని సమాచారం. ఇందుకోసం ప్రముఖ అమెరికన్ కంపెనీ రంగంలోకి దిగిందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రపంచ రికార్డు నెలకొల్పిన నటుడిగా ఘనత సాధిస్తాడు.
7 స్క్రీన్స్ స్టూడియోస్, వయకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్తో ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తీస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: కోడిరామకృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి