ETV Bharat / sitara

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సాయిపల్లవి సోదరి! - actor samudrakhani

saipallavai sister movie: వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ సాయిపల్లవి సోదరి పూజా కన్నన్​ నటించిన తొలి సినిమా 'చిత్తిరి సేవానమ్'​ డిసెంబరు 3న రిలీజ్​ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

సాయిపల్లవి సోదరి కొత్త సినిమా, saipallavi sister new movie
సాయిపల్లవి సోదరి కొత్త సినిమా
author img

By

Published : Nov 23, 2021, 10:33 PM IST

saipallavai sister movie: ప్రముఖ నటి, డ్యాన్సర్‌ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుంది! 'జీ5' ఓటీటీలో డిసెంబర్‌ 3న విడుదల కానున్న తమిళ చిత్రం 'చిత్తిరై సేవానమ్‌' ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది . "చాలా కాలం నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొంచెం నెర్వస్‌గా ఉంది. సినిమాలో నా పాత్ర పోషించేటప్పుడు వరకూ ఎంత ఎంజాయ్‌ చేశానో...అదే రీతిలో మీరు నా నటనను ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి" అంటూ ఆ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.

సాయిపల్లవి సోదరి కొత్త సినిమా, saipallavi sister new movie
చిత్తిరి సేవానమ్

శిల్వ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను అగ్రకథానాయకుడు ధనుష్‌ ట్విటర్‌లో విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ తండ్రీ కూతురి కథ అన్నట్లుగా మోషన్‌ పోస్టర్‌ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో పూజకు తండ్రిగా ప్రముఖ నటుడు సముద్రఖని నటించారు. జీ తమిళ్‌, అమిర్తా, థింగ్‌ బిగ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సామ్‌ సీఎస్‌ స్వరాలు సమకూర్చారు.

సాయిపల్లవి, పూజా కన్నన్

దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన పూజ.. 2017లో విడుదలైన తమిళ షార్ట్‌ఫిల్మ్‌ 'కారా'లో నటించింది. ఆరేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్‌'లో మలర్‌గా(sai pallavi premam movie in telugu)+ మాయ చేసింది సాయిపల్లవి. చూడటానికి ఈ అక్కా చెల్లెల్లిదరూ ఇద్దరు ట్విన్స్‌లా కనిపిస్తారంటారు అభిమానులు. మరి సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ ఏ విధంగా నటించిందో చూడాలంటే డిసెంబర్‌ 3వరకూ ఆగాల్సిందే!

ఇదీ చూడండి: హుషారుగా అనుపమ.. కేట్​ శర్మ హాట్​ ఫొటోషూట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.