ఇటీవలే సైరాతో ప్రేక్షకుల మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ చిత్రాన్ని తన కెరీర్లో మధుర జ్ఞాపకంగా మిగుల్చుకున్నాడు. ఇదే ఊపులో నూతన ఏడాదిని కొత్త సినిమాతో మొదలుపెట్టనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న ఈ సినిమా జనవరి 3 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ను ప్రేక్షకులకు కొత్త ఏడాది కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చిత్ర టైటిల్‌పై కొరటాల తుది నిర్ణయం తీసేసుకున్నాడని, తాజాగా చిరు లుక్‌పై కూడా చిత్ర బృందం ఓ క్లారిటీకి వచ్చేసినట్లు సమాచారం అందుతోంది. అందుకే న్యూ ఇయర్ కానుకగా చిత్ర టైటిల్‌తో పాటు చిరు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరు 31 రాత్రి ఈ లుక్ బయటకొచ్చే అవకాశముంది. మరి ఈలోపు చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో చిరుకు జోడీగా త్రిష కనిపించబోతుందట. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు.
ఇదీ చదవండి: డైరెక్టర్‌ను ఒక్కటి పీకాలనిపించింది: 'మత్తు వదలరా' టీమ్