ETV Bharat / sitara

చిరు గుండు లుక్... వావ్​ అనిపించే 'మేకప్​ ట్రిక్​' - chiru gundu look viral

మెగాస్టార్​ చిరంజీవి ఇటీవల గుండు లుక్​లో కనపడి అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో 'మేకింగ్​ ఆఫ్​​ అర్బన్​ మాంక్' అంటూ తన కొత్త లుక్ సీక్రెట్​ను బహిర్గతం చేశారు.

chiru gundu look
చిరు గుండు లుక్
author img

By

Published : Sep 15, 2020, 12:12 PM IST

Updated : Sep 15, 2020, 12:40 PM IST

సినిమా అంటే రంగుల లోకం మాత్రమే కాదు మాయా ప్రపంచం కూడా. ఇందుకే అక్కడ కంటికి కనిపించేవన్నీ నిజం కాదు. ఈ విషయాన్ని మరోసారి నిజం చేశారు మెగాస్టార్​ చిరంజీవి. నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్​ను షేక్ చేసిన మెగా బాస్​.. ఈ మధ్య కాలంలో సోషల్​మీడియాలోనూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆన్​లైన్​ ప్రపంచంలోకి ఆలస్యంగా అడుగుపెట్టినా అప్​డేట్స్​ అందించడంలో జోరుగా ఉంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే తాను గుండుతో ఉన్న లుక్​ను పోస్ట్​ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

గత కొద్ది రోజులుగా ఇది నెట్టింట్లో వైరల్​గా మారింది. ఇందులో నున్నటి గుండు, నల్లటి కళ్లద్దాలతో చిరు అర్బన్‌ మాంక్‌ స్టైల్‌లో కనిపించారు. ఈ లుక్‌ను అభిమానులు లైక్‌లతో ముంచెత్తారు. అంతేకాకుండా చిరు నిజంగా గుండు చేయించుకున్నారా..? యాప్‌ సహాయంతో అలా కనిపించారా..? ఫొటో ఎడిటింగ్‌‌ మహిమా? అనే సందేహాలతో తలమునకలయ్యారు నెటిజన్లు. అయితే వీరి ప్రశ్నలన్నిటికీ చిరు ఈ రోజు సమాధానమిచ్చారు.

'మేకింగ్‌ ఆఫ్ అర్బన్‌ మాంక్'‌ అంటూ తన కొత్త లుక్‌ ఎలా సాధ్యమయిందీ వీడియో ద్వారా తెలియచేశారు. దీనితో సందేహం తీరిన నెటిజన్లు ఇదా సంగతి అని ఆశ్చర్యపోతున్నారు.

చిరు ప్రస్తుతం శివ కొరటాల సారథ్యంలో వస్తున్న ఆచార్యలో నటిస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్‌ ప్రారంభించేందుకు ఈ చిత్ర బృందం సిద్ధంగా ఉంది. మరోవైపు మెగాస్టార్‌ 'లూసిఫర్'‌, 'వేదాళం' రీమేక్‌లలో నటించనున్నారు. కాగా, తమ అభిమాన నటుడు అర్బన్‌ మాంక్‌ గెటప్‌తో వీటిలో ఏదైనా చిత్రంలో కనిపించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇదీ చూడండి బుసాన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఏకైక భారతీయ చిత్రం

Last Updated : Sep 15, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.