మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరకుంది. దీని తర్వాత మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సినిమా ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. షూటింగ్‌ను ఆరు నెల్లల్లోనే పూర్తి చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జనవరిలోనే జరిగింది.
నటుడు సత్యదేవ్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్రసీమకు చెందిన మోహన్ రాజా 'హనుమాన్ జంక్షన్' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇక్కడ విజయవంతమైన పలు సినిమాలను తమిళంలో రీమేక్ చేశారు. చిరంజీవి నటించిన 'హిట్లర్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. ఇన్నాళ్లకు మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంపై ఆయన సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదీ చూడండి: వరుస చిత్రాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్లు!